ODI WC 2023: వన్డే వరల్డ్ కప్‌ టాప్-10.. భారత్‌ మ్యాచ్‌ల అప్‌డేటెడ్‌ షెడ్యూల్‌

వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2023) బరిలోకి దిగే మిగతా రెండు జట్లేవో తేలిపోయింది. హేమాహేమీ జట్లను దాటుకొని నెదర్లాండ్స్‌ అర్హత సాధించింది. క్వాలిఫయర్స్‌లో స్కాట్లాండ్‌ను ఓడించి టాప్‌-10లోకి దూసుకొచ్చింది.

Updated : 08 Jul 2023 11:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచ కప్ 2023 (ODI World Cup 2023) టైటిల్‌ కోసం బరిలోకి దిగే పది జట్లు తేలిపోయాయి. భారత్‌తోపాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ టాప్‌-8లో ఉన్నాయి. ఇక అర్హత మ్యాచ్‌లో బలమైన జట్లను దాటుకొని నెదర్లాండ్స్‌ టాప్‌-10లోకి చేరింది. అంతకుముందు శ్రీలంక అందరికంటే ముందు క్వాలిఫయర్స్‌ మ్యాచ్‌లతోనే అర్హత సాధించిన విషయం తెలిసిందే. దీంతో పది జట్లు సిద్ధమైపోయాయి. అక్టోబర్ 5 నుంచి వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. నవంబర్ 19న అహ్మదాబాద్‌ వేదికగా ఫైనల్ మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో భారత్‌ ఆడే మ్యాచ్‌ల వివరాలకు సంబంధించి తాజా అప్‌డేట్  మీ కోసం.. 

  • భారత్‌ X ఆస్ట్రేలియా : అక్టోబర్ 8, చెన్నై
  • భారత్ X అఫ్గానిస్థాన్‌ : అక్టోబర్ 11, దిల్లీ
  • భారత్ X పాకిస్థాన్ : అక్టోబర్ 15, అహ్మదాబాద్
  • భారత్ X బంగ్లాదేశ్‌ : అక్టోబర్ 19, పుణె
  • భారత్ X న్యూజిలాండ్ : అక్టోబర్ 22, ధర్మశాల
  • భారత్ X ఇంగ్లాండ్ : అక్టోబర్ 29, లఖ్‌నవూ
  • భారత్ X శ్రీలంక: నవంబర్‌ 2, ముంబయి
  • భారత్ X దక్షిణాఫ్రికా: నవంబర్ 5, కోల్‌కతా
  • భారత్ X నెదర్లాండ్స్‌ : నవంబర్ 11, బెంగళూరు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు