Virat Kohli: పరుగుల దాహంతో విరాట్.. బాడీలాంగ్వేజ్‌లోనే తెలిసిపోతోంది: మాజీ బ్యాటింగ్‌ కోచ్

ఆసియా కప్‌ ముందు వరకు దాదాపు మూడేళ్లపాటు సెంచరీ లేకుండా గడిపేసిన టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ.. ఆ భారాన్ని దించుకుంటూ...

Published : 27 Sep 2022 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆసియా కప్‌ ముందు వరకు దాదాపు మూడేళ్లపాటు సెంచరీ లేకుండా గడిపేసిన టీమ్‌ఇండియా స్టార్‌ ఆటగాడు విరాట్ కోహ్లీ.. ఆ భారాన్ని దించుకుంటూ అఫ్గాన్‌పై శతకం కొట్టేశాడు. అప్పటి నుంచి ఆటను ఆస్వాదిస్తూ విజృంభిస్తున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ ప్రదర్శనను టీమ్‌ఇండియా మాజీ బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఉప్పల్‌ వేదికగా జరిగిన కీలక పోరులో విరాట్ కోహ్లీ ఎక్కడా రిలాక్స్‌ అయినట్లు అతడి బాడీ లాంగ్వేజ్‌లో గమనించలేదని చూడలేదని పేర్కొన్నాడు. ఆసియా కప్‌లో రాణించిన తర్వాత తన బ్యాటింగ్‌ లయను అందుకోవడంతోపాటు పరుగుల దాహం ఎక్కువైనట్లు అనిపిస్తోందని తెలిపాడు. 

‘‘విరాట్ కోహ్లీ ఛాంపియన్‌ బ్యాటర్. చాలా కాలంగా టీమ్‌ఇండియా కోసం అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పుడు ఆటను ఆస్వాదించే దశలో ఉన్నాడు. బ్యాటింగ్ లయను అందిపుచ్చుకొన్నాడు. పరుగుల దాహంతో ఉన్నట్లు అతడికీ తెలుసు. ఎందుకంటే ఆసీస్‌తో మూడో టీ20లో కోహ్లీ బాడీ లాంగ్వేజ్‌లో రిలాక్స్‌ అనేది నేను చూడలేదు. ఇదే కదా అతడి నుంచి అభిమానులు కోరుకున్నది. అది చాలా నచ్చింది. ఒక దశలో తీవ్ర ఒత్తిడితో ఇబ్బంది పడిన కోహ్లీ విరామం తీసుకొని బరిలోకి దిగాక అదరగొట్టేస్తున్నాడు’’ అని బంగర్‌ వెల్లడించాడు. 

టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీని ఓ మంచి ఆప్షన్‌ అని రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ.. బంగర్‌ మాట్లాడాడు. ‘‘భారత్‌కు ఓపెనింగ్‌ ఎవరు చేయాలనే విషయంపై చాలా విశ్లేషణలు వస్తున్నాయి. నా వరకైతే చర్చించే అంశమే కాదు. విరాట్ కోహ్లీ మూడో స్థానంలోనే బ్యాటింగ్‌కు రావాలి. కేఎల్ రాహుల్-రోహిత్ శర్మ చాలాసార్లు మంచి భాగస్వామ్యాలను నిర్మించారు. అందుకే ఆసీస్‌తో సిరీస్‌లోనూ కోహ్లీ వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్ చేశాడు. ఇదే పర్యాటక జట్టులో లోపించింది. స్టీవ్‌స్మిత్‌ను కాకుండా ప్లేయర్లతో ప్రయోగాలు చేసి సిరీస్‌ను చేజార్చుకొంది. కోహ్లీతో బ్యాటింగ్‌కు వస్తున్న సూర్యకుమార్‌ అద్భుతంగా ఆడుతున్నాడు’’ అని బంగర్ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని