Virat Kohli - Sourav Ganguly: చేతులు కలపని గంగూలీ, కోహ్లి

సౌరభ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లిల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. శనివారం బెంగళూరు-దిల్లీ మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు.

Updated : 16 Apr 2023 09:36 IST

బెంగళూరు: సౌరభ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లిల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నట్లున్నాయి. శనివారం బెంగళూరు-దిల్లీ మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దిల్లీ జట్టు క్రికెట్‌ డైరెక్టర్‌ అయిన గంగూలీ దగ్గరికి వచ్చేసరికి కోహ్లి పట్టించుకోనట్లు ఉన్నాడు. దిల్లీ కోచ్‌ పాంటింగ్‌తో వైపు చూస్తూ మాట్లాడాడు. గంగూలీ అతణ్ని దాటి ముందుకు వెళ్లి వేరే ఆటగాడితో కరచాలనం చేశాడు. టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌గా తనపై వేటు పడటంలో అప్పటి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న గంగూలీనే కారణమని విరాట్‌ భావిస్తూ అతడిపై పరోక్ష విమర్శలు చేయడంతో వీరి మధ్య అగాథం ఏర్పడ్డ సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని