Virat Kohli: రిటైరైతే కనపడను..

క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్‌ కోహ్లి అన్నాడు. ఐపీఎల్‌లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్‌ల్లో 661 పరుగులు చేశాడు.

Published : 17 May 2024 03:57 IST

బెంగళూరు: క్రికెట్లో ఉన్నంత కాలం శక్తినంతా ధార పోస్తానని, ఒక్కసారి రిటైరైతే కొంతకాలం ఎవరికీ కనపడనని కింగ్‌ కోహ్లి అన్నాడు. ఐపీఎల్‌లో జోరుమీదున్న కోహ్లి ఇప్పటివరకు బెంగళూరు తరఫున 13 మ్యాచ్‌ల్లో 661 పరుగులు చేశాడు. టోర్నీ టాప్‌ స్కోరర్‌ అతడే. పశ్చాత్తాప రహితంగా జీవించాలన్న తపనే తనను నడిపిస్తోందని సోషల్‌ మీడియాలో ఆర్సీబీ పోస్ట్‌ చేసిన వీడియోలో కోహ్లి చెప్పాడు. ‘‘ఏ పనినైనా అసంపూర్తిగా వదిలేసి తర్వాత బాధపడకూడదు. నాకా పరిస్థితి రాదని కచ్చితంగా చెప్పగలను. ఒక్కసారి రిటైరయ్యానంటే మళ్లీ కనపడను. కొంతకాలం మీరు నన్ను చూడలేరు. అందుకే ఆటలో కొనసాగినంత కాలం సర్వశక్తులూ ఒడ్డుతా. నన్ను నడిపించేది అదే’’ అని అన్నాడు. కెప్టెన్‌గా 2008 అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత జట్టును విజేతగా నిలిపిన తర్వాత కోహ్లిని ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది. అప్పటి నుంచి అతడు ఆ ఫ్రాంఛైజీతోనే కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని