Virat Kohli: లతాజీని కలిసి మాట్లాడలేకపోయా..!: విరాట్‌ కోహ్లీ

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న స్టార్‌ బ్యాటర్ విరాట్‌ కోహ్లి భారత నేపథ్య గాయని లతా మంగేష్కర్‌ను కలిసే అవకాశం తనకు రాలేదని విచారం వ్యక్తం చేశాడు. 

Published : 01 Feb 2023 01:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత నేపథ్య గాయని లతా మంగేష్కర్‌తో మాట్లాడే అవకాశం తనకు రాలేదని విరాట్‌ కోహ్లీ విచారం వ్యక్తం చేశాడు. తాజాగా కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా..  ‘చరిత్రాత్మక మహిళతో డిన్నర్‌ చేసే అవకాశం వస్తే మీరు ఎవరితో డిన్నర్‌ చేస్తారు? అని అడగ్గా.. లతాజీ పేరు చెప్పాడు.  భారతీయ గొప్ప గాయనీమణుల్లో ఒకరైన లతా మంగేష్కర్‌(92) అనారోగ్యంతో గతేడాది ఫిబ్రవరిలో మరణించారు. ఆమె క్రికెట్‌ని ఎక్కువగా అభిమానించేవారు.

‘‘లతాజీని కలిసే అవకాశం నాకు ఎప్పుడూ రాలేదు.  ఆమెను కలిసి మాట్లాడే అవకాశం వస్తే బాగుండేది. ఆమె జీవిత ప్రయాణం గురించి ఎక్కువగా తెలుసుకునే వాడిని’’ అని తెలిపాడు. ఫిట్‌నెస్‌కి కోహ్లీ ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మనందరికి తెలిసిందే. ఇదే ఇంటర్వ్యూలో తన ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ని వెల్లడించాడు విరాట్. పుష్ అప్స్‌ చేసే పొజిషన్‌ (ప్లాంకింగ్) లో రోజూ మూడున్నర నిమిషాలపాటు ఉంటానని తెలిపాడు. కివీస్‌తో జరుగుతున్న  టీ20 సిరీస్‌కు కోహ్లీ దూరంగా ఉన్నాడు. భారత్‌ - ఆస్ట్రేలియా మధ్య ఫిబ్రవరి 9న ప్రారంభమయ్యే బోర్డర్‌ - గావస్కర్‌ ట్రోఫీలో కోహ్లీ ఆడనున్నాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని