Virat Kohli: సెంచరీ @ 50.. సచిన్‌ను అధిగమించిన విరాట్‌ కోహ్లీ

వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కివీస్‌పై సెంచరీ సాధించి అదరగొట్టేశాడు.

Updated : 15 Nov 2023 18:01 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) న్యూజిలాండ్‌పై టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) శతకం బాదేశాడు. అయితే, దీనికో ప్రత్యేకత ఉందండోయ్‌. వన్డే చరిత్రలో 50 శతకాలు బాదిన ఏకైక బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ అవతరించాడు. ఇప్పటి వరకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (49) కలిసి సమాన రికార్డులో ఉన్న విరాట్ అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. కేవలం 279 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ కోహ్లీ వన్డేల్లో 50వ శతకాన్ని నమోదు చేయడం విశేషం. 

కివీస్‌పై శతకంతో విరాట్ కోహ్లీ మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకే వన్డే ప్రపంచకప్‌లో 8సార్లు 50+ ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అలాగే ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలోనూ విరాట్‌దే అగ్రస్థానం. ఇప్పటి వరకు సచిన్‌ 2003లో సాధించిన 673 పరుగులే అత్యధికం కాగా.. విరాట్ దానిని అధిగమించేశాడు. ప్రస్తుతం 694 పరుగులతో కొనసాగుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని