Playoffs Race: ‘ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవటానికి కోహ్లీ అన్ని విధాలా కృషి చేస్తాడు’

ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ రేసులో నిలవడానికి  ఆ జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ  (Virat Kohli) తన శక్తి మేరకు అన్ని విధాలా కృషి చేస్తాడని సన్‌రైజర్స్‌ మాజీ కోచ్‌ టామ్‌ మూడీ అన్నాడు.

Updated : 18 May 2023 18:24 IST

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ప్రథమార్థంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బాగానే ఆడినప్పటికీ రెండో సీజన్‌లో ఆశించిన ప్రదర్శన కనబర్చలేదని సన్‌రైజర్స్‌ మాజీ హెడ్ కోచ్ టామ్‌ మూడీ అన్నాడు. అయితే, ఆర్సీబీ ప్లేఆఫ్స్‌ రేసులో నిలవడానికి  ఆ జట్టు మాజీ కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (Virat Kohli) తన శక్తి మేరకు అన్ని విధాలా కృషి చేస్తాడని పేర్కొన్నాడు. 

‘‘ఈ సీజన్‌ ప్రథమార్థంలో ఆర్సీబీ బాగా ఆడింది. కానీ, ద్వితీయార్థంలో ఆ జట్టు వెనకబడి పోయింది. కాబట్టి, వారు  తమ మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం కోసం వంద శాతం కృషి చేయాల్సిన అవసరముంది.  వారికి విరాట్ కోహ్లీ వంటి ఆటగాడు ఉన్నాడు. ఆర్సీబీ ప్లేఆఫ్స్ రేసులో నిలవడానికి కోహ్లీ తన శక్తి మేరకు కృషి చేస్తాడు’’ అని టామ్‌ మూడీ ఓ క్రీడా ఛానల్‌ నిర్వహించిన కార్యక్రమంలో అన్నాడు.

భారత మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ ఆర్సీబీ ఆటతీరు గురించి మాట్లాడాడు. ఆ జట్టు  (KGF) విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుప్లెసిస్‌లపై ఎక్కువగా ఆధారపడుతోందన్నాడు. ‘ఆర్సీబీ జట్టుగా ఆడాలి.  కేవలం ముగ్గురు ఆటగాళ్లపై (కోహ్లీ, మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్) ఆడితే సరిపోదు. ఇప్పుడు ప్రతి ఆటగాడు ముందుకు వచ్చి తన బాధ్యతను నెరవేర్చాలి’ అని యూసుఫ్‌ పఠాన్ అన్నాడు.

ఈ సీజన్‌లో బెంగళూరు ఇప్పటివరకు 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 6 ఓటములతో ఉంది. ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి. ఈ క్రమంలో నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం బెంగళూరుకు అత్యావశ్యకం. ఓడినా ఆ జట్టు రేసులో ఉంటుంది కానీ.. ఆఖరి మ్యాచ్‌లో గెలవడంతో పాటు మిగతా జట్ల ఫలితాలు కలిసిరావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని