Kohli-DK: ‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్‌కు షాకైన దినేశ్ కార్తిక్‌

Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్‌ అవుతోంది. దినేశ్‌ కార్తిక్‌ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..?

Published : 20 Apr 2024 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కోల్‌కతాతో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న బెంగళూరు ఆటగాళ్లు ఇటీవల ఓ ప్రమోషనల్‌ షూట్‌లో పాల్గొన్నారు. ఇందులో దినేశ్‌ కార్తిక్‌ (Dinesh Karthik) ప్రజెంటర్‌గా వ్యవహరించి తన టీమ్‌మేట్స్‌ను కొన్ని ప్రశ్నలు అడిగారు. అయితే, కొన్ని ప్రశ్నలకు విరాట్‌ కోహ్లీ (Virat Kohli).. దీపికా పల్లికల్‌, స్క్వాష్‌ పేర్లు చెప్పడంతో డీకే షాకయ్యాడు.

బెంగళూరు కెప్టెన్‌ డుప్లెసిస్‌, రజత్‌ పటీదార్‌, సిరాజ్‌తో కలిసి కోహ్లీ, డీకే ఈ షూట్‌లో పాల్గొన్నారు. ఇందులో డీకే తన వ్యక్తిగత ఆసక్తులపై ఆటగాళ్లను కొన్ని ప్రశ్నలు వేశాడు. వీరి మధ్య సరదా సంభాషణ సాగిందిలా..

డీకే : క్రికెటర్‌ కాకుండా నా ఫేవరెట్‌ క్రీడాకారులు ఎవరని మీరు అనుకుంటున్నారు?

కోహ్లీ : (నవ్వుతూ) ఇంకెవరు మీ భార్య (స్క్వాష్‌ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌).

డీకే : చాలా గొప్ప సమాధానం. నా మైండ్‌లో మరో జవాబు ఉంది. కానీ నువ్వు నేను కాదనలేని సమాధానం చెప్పావు. నిజంగా ఆశ్చర్యపోయా. 

డీకే : ఈ ఐపీఎల్‌ సీజన్‌ ముగియగానే నా హాబీ ఏంటి? కామెంటింగ్ కాకుండా ఇంకా ఏం చేస్తాను?

కోహ్లీ : ఇంకేముంది స్క్వాష్‌ ఆడుతావు అని చెప్పడంతో అక్కడున్నవారంతా నవ్వులు చిందించారు.

జాతీయస్థాయి స్క్వాష్‌ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను 2015లో దినేశ్ కార్తిక్‌ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కవల పిల్లలున్నారు. ఈ వెటరన్‌ ప్లేయర్‌ తాజా సీజన్‌లో అదరగొడుతున్న సంగతి తెలిసిందే. మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్నా డీకే మాత్రం మంచి షాట్లతో రాణిస్తూ తనలోని బ్యాటింగ్‌ దూకుడు తగ్గలేదని నిరూపిస్తున్నాడు. ఇక, ఈ ఐపీఎల్‌ సీజన్‌లో బెంగళూరు వరుస ఓటములతో సతమతమవుతూ పాయింట్ల పట్టికలో ఆఖరున ఉంది. ఆదివారం ఈ జట్టు కోల్‌కతాతో తలపడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు