Virender sehwag: క్రిప్టో కరెన్సీ కన్నా వేగంగా టీమ్ ఇండియా ఫామ్‌ను కోల్పోతోంది: వీరేంద్ర సెహ్వాగ్

బంగ్లాదేశ్‌(Bangladesh)పై రెండో వన్డేలో టీమ్‌ఇండియా(Team india) ఓటమిపై వీరేంద్ర సెహ్వాగ్‌(Virender sehwag) స్పందించాడు. ఇప్పటికైనా జట్టు మేల్కోవాల్సిన అవసరం ఉందన్నాడు. 

Updated : 08 Dec 2022 11:20 IST

దిల్లీ: బంగ్లా(Bangladesh)తో మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 0-2తో టీమ్‌ఇండియా(Team india) సిరీస్‌(Ind vs Ban 2022)ను కోల్పోయిన విషయం తెలిసిందే. బంగ్లా టెయిలెండర్‌ మెహదీ హసన్‌ మిరాజ్‌ చిరస్మరణీయ శతకం, పేలవమైన బ్యాటింగ్‌ కలగలిసి ఈ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో టీమ్‌ఇండియాకు ఓటమిని మిగిల్చాయి. ఈ నేపథ్యంలో మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌(Virender sehwag) జట్టు ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘క్రిప్టో కరెన్సీ కన్నా వేగంగా టీమ్‌ఇండియా ఫామ్‌ను కోల్పోతోంది. మార్పులకు, మేల్కొలుపు ఇప్పుడు చాలా అవసరం’’ అంటూ ట్వీట్‌ చేశాడు. 

వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ టోర్నమెంట్‌ ముంగిట భారత్‌కు ఈ సిరీస్‌ కీలకంగా మారింది. అయితే, 50వ ఓవర్‌ చివరి బంతికి భారత్‌కు సిక్స్‌ అవసరం కాగా.. ముస్తాఫిజుర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో బంగ్లాకు విజయాన్నందించాడు. ఈ సిరీస్‌లో బంగ్లా విజయం సాధించింది. గాయం కారణంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ చివరి వన్డేతో పాటుగా రానున్న రెండు టెస్టులకు దూరమయ్యాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని