VVS Laxman: వన్డే వరల్డ్‌కప్‌ స్క్వాడ్‌ ఎంపిక కత్తిమీద సామే: వీవీఎస్‌ లక్ష్మణ్‌

వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌కు జట్టు ఎంపిక సెలక్టర్లకు కత్తిమీద సాముగా మారనుందని హైదరాబాదీ వెటరన్‌ బ్యాటర్‌, నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ అధిపతి వీవీఎస్‌ లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు.

Published : 07 Oct 2022 10:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌:  వచ్చే ఏడాది వన్డే వరల్డ్‌కప్‌నకు జట్టు ఎంపిక సెలక్టర్లకు కత్తిమీద సాముగా మారనుందని హైదరాబాదీ వెటరన్‌ బ్యాటర్‌, నేషనల్‌ క్రికెట్‌ అకాడమీ అధిపతి వీవీఎస్‌ లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు లక్ష్మణ్‌ స్టాండ్‌ ఇన్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. యువ క్రికెటర్లు అద్భుతంగా ఆడుతుండటంతో సెలక్టర్ల ఆప్షన్లు కఠినతరంగా మారనున్నాయని లక్ష్మన్‌ విశ్లేషించాడు.

‘‘బ్యాకప్‌ కోచ్‌గా ఇప్పటి వరకు బాగానే ఉంది. ఈ విధానం ఐర్లాండ్‌ సిరీస్‌ నుంచి  ప్రారంభించారు. రాహుల్‌ ద్రవిడ్‌  టీ20 ప్రపంచ కప్‌నకు పూర్తిస్థాయిలో సేవలు అందించేలా వెసులుబాటు లభిస్తోంది. మా వద్ద సరిపడినంత మంది మంచి క్రికెటర్లు ఉన్నారు. వారంతా భవిష్యత్తు సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొని సిద్ధమవుతున్నారు. వారి మధ్య మంచి పోటీ ఉంది. 2023 వన్డే ప్రపంచ కప్‌నకు సరైన జట్టును ఎంపిక చేయడం సెలక్టర్లకు కష్టతరం కానుంది. ఒక్క సారి ప్రధాన ఆటగాళ్లు తిరిగి వస్తే అవకాశాలు పరిమితం అవుతాయని యువ ఆటగాళ్లకు తెలుసు. వారు బాగా ఆడుతున్నారు. వారికి ఇది ఒక మంచి అవకాశం. బాగా ఆడిన వారినే ఎంపిక చేస్తున్నప్పుడు.. మంచి ప్రదర్శనతో అవకాశాలను సజీవంగా ఉంచుకోవచ్చు’’ అని వీవీఎస్‌ లక్ష్మణ్‌  పేర్కొన్నారు.

దక్షిణాఫ్రికాతో జరుగుతన్న వన్డే సిరీస్‌లో ధావన్‌ నేతృత్వంలోని మరో భారత జట్టు మాత్రం వన్డే సిరీస్‌లో శుభారంభం చేయలేకపోయింది. బౌలింగ్‌లో సగం ఇన్నింగ్స్‌ వరకు పైచేయి సాధించినా.. బ్యాటింగ్‌లో ఆరంభ తడబాటును అధిగమించి మెరుగైన స్థితికి చేరుకున్నా.. ఆఖర్లో పట్టు విడవడంతో ఓటమి తప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని