IPL 2023: ఒత్తిడిలోనూ అద్భుత ప్రదర్శన.. అతడికి మంచి భవిష్యత్తు : వసీమ్ అక్రమ్
వరుస ఐపీఎల్ సీజన్లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే నిలకడైన ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్. సీఎస్‌కే తరఫున ఈ సీజన్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌లో (IPL) చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఐదోసారి విజేతగా నిలవడంలో ఆ జట్టు ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj) కీలక పాత్ర పోషించాడు. డేవన్ కాన్వేతో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్‌లను నిర్మించాడు. ఈ సీజన్‌లో 16 మ్యాచుల్లో ఆడిన రుతురాజ్ నాలుగు అర్ధశతకాల సాయంతో 590 పరుగులు సాధించాడు. 2021 సీజన్‌లో రుతురాజ్ 635 పరుగులు చేశాడు. అప్పుడు కూడా సీఎస్‌కే ఛాంపియన్‌గా నిలిచింది. రుతురాజ్ గైక్వాడ్ ప్రదర్శనపై పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తులో టీమ్‌ఇండియాకు విలువైన ఆస్తిగా మారతాడని అభిప్రాయపడ్డాడు.
‘‘తీవ్ర ఒత్తిడిలోనూ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఫిజికల్‌గా చాలా ఫిట్‌గా ఉంటాడు. ఈసారి ఐపీఎల్‌లో అద్భుతమైన క్యాచ్‌లు, ఫీల్డింగ్‌ను మనం చూశాం. అందుకే, గైక్వాడ్‌కు మంచి భవిష్యత్తు ఉంది. భారత జట్టుతోపాటు ఫ్రాంచైజీ క్రికెట్‌లోనూ కీలక ప్లేయర్‌గా మారతాడు’’ అని అక్రమ్ తెలిపాడు. తొలి మ్యాచ్‌లోనే గుజరాత్ టైటాన్స్‌పై 92 పరుగులు చేసి తన ఫామ్‌ను కొనసాగించాడు. ఇక ఫైనల్‌లో గుజరాత్‌పై దూకుడుగా ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో 16 బంతుల్లోనే 26 పరుగులు చేసి శుభారంభం అందించాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైనప్పటికీ జూన్ 3వ తేదీన వివాహం ఉండటంతో రుతురాజ్ ఆడలేకపోతున్నాడు.
గతడాది భారత జట్టులోకి అడుగు పెట్టిన రుతురాజ్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఇప్పటి వరకు 10 టీ20లు ఆడిన రుతురాజ్ 161 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అత్యధిక స్కోరు 57 పరుగులు మాత్రమే. ఇక ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడిన గైక్వాడ్ 42 బంతులను ఎదుర్కొని 19 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. ఐపీఎల్ 2023 సీజన్‌లో అద్భుతంగా రాణించడంతో మరోసారి భారత జట్టులోకి అవకాశం లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Manipur Violence: విద్యార్థుల దారుణ హత్యతో వేడెక్కిన మణిపుర్.. పెల్లుబికిన నిరసనలు
-
South Korea: అణ్వాయుధాలే ప్రయోగిస్తే.. అంతం చేస్తాం..! కిమ్‌కు హెచ్చరిక
-
JetBlue: విమానం ల్యాండింగ్‌కు ముందు ప్రతికూల వాతావరణం.. గాయపడిన ప్రయాణికులు
-
Ambani: అంబానీ వారసులకు వేతనాలు ఉండవు
-
IND vs AUS: బరిలోకి నలుగురు ‘కీ’ ప్లేయర్లు.. అరుదైన ఘనతపై భారత్ కన్ను!
-
AP High Court: అమరావతి రింగ్‌రోడ్డు కేసు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా