Wasim akram: ఏమో.. నిజంగానే అతడు డబ్బు తీసుకొని ఉండొచ్చు: వసీం అక్రమ్‌

పాకిస్థాన్‌(Pakistan) మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌పై వసీం అక్రమ్‌(Wasim Akram) సంచలన ఆరోపణలు చేశాడు. 

Updated : 07 Dec 2022 12:40 IST

కరాచీ: పాకిస్థాన్‌(Pakistan) మాజీ కెప్టెన్‌ సలీం మాలిక్‌ తననో పనివాడిలా చూసేవాడంటూ వసీం అక్రమ్‌(Wasim Akram) సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన జీవిత చరిత్ర ‘సుల్తాన్‌.. ఎ మెమోయర్‌’ అనే పుస్తకంలో మరో మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌పైనా ఈ మాజీ కెప్టెన్‌ విమర్శలు గుప్పించాడు.

‘‘1996 లార్డ్స్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో కొందరు లాబీయిస్టులు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కోసం సంప్రదించినట్లు రషీద్‌ సండే టెలిగ్రాఫ్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అందుకు £15,000 డబ్బును ఆశ చూపారనీ అతడు తెలిపాడు. ఎవరికి తెలుసు అతడు నిజంగానే ఆ డబ్బును తీసుకుని ఉండొచ్చు. ఎందుకంటే, ఈ విషయాన్ని జట్టు కెప్టెన్‌, కోచ్‌, మేనేజర్లకు అతడు చెప్పాడా? లేదు కదా. అతడు అందరి దృష్టినీ ఆకర్షించాలని అనుకున్నప్పుడే ఇలాంటి విషయాలు బయటకు రావడం గమనార్హం’’ అని అక్రమ్‌ తెలిపాడు. ఇక తన సహచర ఆటగాడు ఆమిర్‌ సోహైల్‌ సైతం లాబీయింగ్‌కి పాల్పడేవాడని.. అతడిని ‘జాంబీ ఫిగర్‌’ అని అక్రమ్‌ విమర్శించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని