ఐపీఎల్‌లో విరాట్ - గంభీర్‌ ఎపిసోడ్‌.. దూకుడు ఎప్పుడూ మంచిదే: కేల్‌ మేయర్స్‌

విరాట్ కోహ్లీ (Virat Kohli) మైదానంలో ఎంతో దూకుడుగా ఉంటాడు. ఇప్పటికే అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్‌లోనూ చూశాం. వెస్టిండీస్‌ స్టార్‌ ప్లేయర్ కేల్ మేయర్స్‌ కూడా ఐపీఎల్‌లో ప్రత్యక్షంగా విరాట్ దూకుడు రుచి చూశాడు.

Published : 06 Aug 2023 13:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: విరాట్ కోహ్లీ - గౌతమ్‌ గంభీర్‌ (Virat - Gambhr) వాగ్వాదం.. గత ఐపీఎల్‌లో హాట్‌ టాపిక్‌గా మారిన సంఘటన. ఇప్పటికీ అభిమానుల మదిలో అలాగే ఉండిపోయింది. మరి అలాంటి సంఘటనలో ప్రత్యక్షంగా ఉన్న ఆటగాడు కేల్‌ మేయర్స్‌. ప్రస్తుతం భారత్ - వెస్టిండీస్‌ జట్ల మధ్య టీ20 సిరీస్‌ జరుగుతోంది. ఈ సిరీస్‌లో కేల్‌ మేయర్స్‌ ఆడుతుండగా.. విరాట్ విశ్రాంతి తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో చోటు చేసుకున్న సంఘటనపై తాజాగా కేల్ మేయర్స్‌ స్పందించాడు. 

ఈ నాలుగే సెమీస్‌కు.. టీమ్‌ఇండియాలో ఆ సీనియర్‌ ఉండాల్సిందే

‘‘ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో వాగ్వాదం జరిగింది కదా. ఆ మ్యాచ్‌ సందర్భంగా విరాట్‌ దూకుడు గురించి నువ్వేమి అనుకుంటున్నావు?’’ అని కేల్‌ మేయర్స్‌ను రిపోర్టర్‌ ప్రశ్నించాడు

‘‘ప్రత్యర్థితో కొన్నిసార్లు ఇలా ప్రవర్తించడం అవసరం. మ్యాచ్‌ సందర్భంగా పైచేయి సాధించాలంటే దూకుడుగా ఉండాలి. అందుకే, దూకుడుగా ఉండే స్వభావం ఎప్పుడూ మంచిదే. జట్టు విజయం సాధించేలా సహచరుల్లో ధైర్యం నూరిపోయడానికి అది ఉపయోగపడుతుంది’’ అని మేయర్‌ వ్యాఖ్యానించాడు. 

ఇదీ జరిగింది..

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ మ్యాచ్‌ అనంతరం కేల్ మేయర్స్, విరాట్ కోహ్లీతో ఏదో మాట్లాడుతుండగా.. ఎల్‌ఎస్‌జీ మెంటార్ గౌతమ్‌ గంభీర్‌ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లాడు. అనంతరం గంభీర్ - కోహ్లీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఐపీఎల్‌ కోడ్ ఆఫ్‌ కండక్ట్ ప్రకారం గంభీర్, విరాట్ కోహ్లీపై 100 శాతం మ్యాచ్‌ ఫీజ్‌లో కోత విధించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని