Kane Williamson: సమయం లేదు కేన్ మామా.. ఇక కావాల్సింది విజయాలే
వీళ్లు రాణిస్తే.. ప్రత్యర్థులు చిత్తవ్వాల్సిందే
భారత టీ20 లీగ్ కీలక దశకు చేరుకుంది. అన్ని జట్లు ఇక ఆడాల్సిన మ్యాచ్‌లు మూడు, నాలుగే మిగిలి ఉన్నాయి. ఇప్పటికే ప్లేఆఫ్స్ బెర్తులు దాదాపు ఖరారు చేసుకున్న లఖ్‌నవూ, గుజరాత్ తప్పించి రాజస్థాన్, బెంగళూరు, దిల్లీ, హైదరాబాద్, పంజాబ్, కోల్‌కతా మిగతా స్థానాల కోసం పోటీపడుతున్నాయి. అయితే, హైదరాబాద్ ఒక దశలో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలుపొంది టాప్‌లో నిలిచేలా కనిపించినా గత మూడు మ్యాచ్‌లు ఓటమిపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ప్లేఆఫ్స్ చేరాలంటే కేన్ మామ జట్టులో ఈ ఆటగాళ్లు రాణించాలి..
కెప్టెన్ ఇన్నింగ్స్ అవసరం..
ఈ సీజన్‌లో కెప్టెన్ విలియమ్సన్ తడబడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందుకు అతడి గణాంకాలే నిదర్శనం. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఒక్క అర్ధశతకం మినహాయించి మరో భారీ ఇన్నింగ్స్ ఆడింది లేదు. ఇప్పుడు మిగతా జట్లతో పోటీ తీవ్రమవడంతో ఇకపై రాణించక తప్పదు. టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్‌క్రమ్, నికోలస్ పూరన్ రాణిస్తున్నా విలియమ్సన్ ఒక్కడే పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో ఇప్పుడు అతడు గేర్ మార్చాల్సిన అవసరం ఉంది. ఇకపై జరిగే మ్యాచ్‌ల్లో కేన్ మామ బ్యాట్ ఝుళిపిస్తే ఈ విభాగంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
భువి వికెట్లు తీయాల్సిందే..
ఇక బౌలింగ్ యూనిట్‌లో హైదరాబాద్‌కు పెద్ద దిక్కు భువనేశ్వర్ కుమార్ అనే సంగతి అందరికీ తెలిసిందే. తన స్వింగ్ బౌలింగ్ వైవిధ్యంతో మంచి పేరు సంపాదించుకున్న అతడు ఈ సీజన్‌లో (7.17 ఎకానమీ) పొదుపుగా బౌలింగ్ చేస్తున్నా.. వికెట్లు తీయలేక తంటాలు పడుతున్నాడు. ఆడిన 10 మ్యాచ్‌ల్లో 10 వికెట్లే తీశాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఇకపై ప్రత్యర్థులను కట్టడి చేయాలంటే భువి పదునైన బంతులు సంధించి వికెట్లతో చెలరేగాల్సిందే. లేదంటే రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇతర జట్లు ఆధిపత్యం చలాయించే అవకాశం ఉంది.
నటరాజన్ రావాల్సిందే..
హైదరాబాద్ బౌలింగ్‌లో లీడింగ్ వికెట్ టేకర్ (17)గా కొనసాగుతున్న నటరాజన్ దిల్లీతో ఆడిన గతమ్యాచ్‌లో గాయం కారణంగా తుది జట్టులో లేడు. వికెట్లు తీయడంలో, పొదుపుగా బౌలింగ్ చేయడంలో నటరాజన్ ఈ సీజన్‌లో మంచిపేరు తెచ్చుకున్నాడు. డెత్ ఓవర్లలో యార్కర్లతో ప్రత్యర్థులను చిత్తు చేసే అతడు తుది జట్టులోకి తిరిగి వస్తే జట్టుకు మరింత ఉపయోగం. రాబోయే మ్యాచ్‌ల్లో నటరాజన్‌కు తోడు భువనేశ్వర్ కూడా వికెట్లు సాధిస్తే హైదరాబాద్‌కు తిరుగుండదు. ప్రస్తుతం నట్టూ.. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో టాప్-4లో నిలిచాడు.
ఉమ్రాన్ నువ్వు కూడా..
ఇప్పటికే ఈ సీజన్‌లో అత్యధిక వేగంతో బంతులు సంధిస్తూ ప్రత్యర్థుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బౌలర్‌గా ఉమ్రాన్ మాలిక్ సెన్సేషన్ క్రియేట్ చేశాడు. నిలకడగా 150కిమీ వేగానికి పైగా బంతుల్ని బుల్లెట్లలా విసురుతున్నాడు. ఈ క్రమంలోనే ఆడిన 10 మ్యాచ్‌ల్లో మొత్తం 15 వికెట్లు పడగొట్టి రాణిస్తున్నాడు. అయితే, గతరెండు మ్యాచ్‌ల్లో అతడు ఒక్క వికెట్ కూడా తీయకపోగా ధారాళంగా పరుగులిచ్చాడు. రాబోయే మ్యాచ్‌ల్లోనూ ఇలాగే బౌలింగ్ చేస్తే జట్టుకు కష్టాలు తప్పవు. ఉమ్రాన్ వేగంతోపాటు వైవిధ్యాన్ని కూడా జోడిస్తే జట్టుకు మంచి ఫలితాలు లభిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
- ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం..
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?
-
Sports News
Serena William: టెన్నిస్‌కు దూరంగా ఉండాలనుకుంటున్నా: సెరీనా విలియమ్స్
-
Politics News
Shashi Tharoor: విదేశీ పార్లమెంట్లలోనే ప్రధాని ఎక్కువగా మాట్లాడతారు: శశిథరూర్
-
Sports News
T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
-
General News
Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
-
General News
Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kolkata: బికినీ ధరించిన ప్రొఫెసర్.. రూ.99కోట్లు కట్టాలంటూ యూనివర్సిటీ ఆదేశం!
- T20 Matches: టీ20ల్లోకి ఎందుకు తీసుకోవడం లేదో నాకైతే తెలియదు!
- Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
- ప్రతి విమాన సంస్థా ఆ జాబితా ఇవ్వాల్సిందే.. ఆర్థిక నేరగాళ్లకు చెక్ పెట్టేందుకేనా?
- Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
- Whatsapp: వాట్సాప్ నుంచి ప్రైవసీ ఫీచర్లు.. ఇక మీ ‘జాడ’ కనిపించదు!
- Bihar politics: భాజపాకు నీతీశ్ కుమార్ ఝులక్.. నెట్టింట మీమ్స్ హల్చల్
- Nitish kumar: బిహార్ సీఎంగా నీతీశ్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్!
- Nithiin: అందుకే మా సినిమాకు ‘మాచర్ల నియోజకవర్గం’ టైటిల్ పెట్టాం!
- Maharashtra: రెండు నెలలు కాలే.. అప్పుడే లుకలుకలా..?