
T20 League : రెండు జట్లు ఫిక్స్.. మరో రెండింటి కోసం టఫ్ ఫైట్
ఎక్కువ అవకాశాలు ఉన్న జట్లపై ప్రత్యేక కథనం
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత టీ20 మెగా టోర్నీలో ముప్పావు మ్యాచులు ముగిసినా టాప్-4 జాబితాలో ఉండే జట్లు ఏంటనేవి ఇంకా తెలియలేదు. మ్యాచులు జరిగే కొద్దీ ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకునే జట్లేవో తెలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. కొన్ని జట్లేమో వరుసగా ఓటమి బాట పట్టగా.. మరికొన్నేమో విజయాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పటి వరకు లీగ్ దశలో 56 మ్యాచ్‌లు ముగిశాయి. ఇందులో రెండు జట్లు దాదాపు ప్లేఆఫ్స్ బెర్తులను ఖరారు చేసుకోగా.. మిగతా రెండు స్థానాలు ఎవరికి దక్కుతాయో తేలాల్సి ఉంది. మరి అవేంటో ఓ సారి తెలుసుకుందాం..
తొలిసారే బెర్తులు ఖరారు..
హేమాహేమీలను కాదని కొత్త జట్లు లఖ్‌నవూ, గుజరాత్ ఈ సీజన్‌లో దూసుకుపోతున్నాయి. రెండు జట్లూ తలో పదకొండేసి మ్యాచ్‌లను ఆడేశాయి. ఎనిమిదేసి విజయాలతో ఉన్నాయి. అయితే కాస్త రన్‌రేట్ ఎక్కువగా ఉండటంతో లఖ్‌నవూ (16) గుజరాత్ (16) కంటే ముందుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ జట్లకు ఇంకా మూడేసి మ్యాచ్‌లు ఉన్నాయి. వాటిల్లో ఓడినా సరే పదహారేసి పాయింట్లతో టాప్-4లో మాత్రం ఉండటం పక్కా. కాబట్టి గుజరాత్, లఖ్‌నవూ దాదాపు ప్లేఆఫ్స్‌కు వెళ్లినట్లే.
మిగిలిన మ్యాచ్‌లు..
* లఖ్‌నవూ: గుజరాత్, రాజస్థాన్, కోల్‌కతా
* గుజరాత్: లఖ్‌నవూ, చెన్నై, బెంగళూరు
రెండు జట్లకే ఎక్కువ అవకాశాలు
లఖ్‌నవూ, గుజరాత్ టీమ్‌ల తర్వాత పాయింట్ల పట్టికలో రాజస్థాన్ (14), బెంగళూరు (14) వరుసగా ఉన్నాయి. అయితే బెంగళూరు ఇప్పటి వరకు 12 మ్యాచులకుగాను ఏడు విజయాలు, ఐదు ఓటములతో కొనసాగుతోంది. కానీ రాజస్థాన్ మాత్రం 11 మ్యాచుల్లోనే ఏడు విజయాలు నమోదు చేసింది. కాబట్టి బెంగళూరు కంటే రాజస్థాన్‌కే కాస్త అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవేళ మిగతా మూడు మ్యాచ్‌లను కనీసం రెండు గెలిస్తే రాజస్థాన్ ఖాయంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. అదేవిధంగా బెంగళూరు తన చివరి రెండు మ్యాచుల్లో విజయం సాధిస్తే మాత్రం ఇతర జట్ల సమీకరణాలతో అవసరం లేకుండానే ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. అలా కాకుండా ఒకటే గెలిస్తే రన్‌రేట్‌ను బట్టి అడుగు ముందుకు పడుతుందో లేదో చూడాలి.
మిగిలిన మ్యాచ్‌లు..
* రాజస్థాన్: దిల్లీ, లఖ్‌నవూ, చెన్నై
* బెంగళూరు: పంజాబ్, గుజరాత్
ఈ మూడు ముందుకు సాగేనా..?
వరుసగా ఐదు మ్యాచ్‌లను గెలిచి ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చిన హైదరాబాద్ ఆ తర్వాత నాలుగు ఓటములతో డీలా పడింది. హైదరాబాద్‌తో పాటు దిల్లీ, పంజాబ్ జట్లు కూడా ఐదేసి విజయాలతో 10 పాయింట్లు సాధించాయి. ప్రస్తుతం దిల్లీ ఐదు, హైదరాబాద్ ఆరు, పంజాబ్ ఏడో స్థానాల్లో నిలిచాయి. ఇంకా ఈ జట్లకు మూడేసి మ్యాచ్‌లు ఉన్నాయి. అన్నింట్లోనూ గెలిస్తే తప్పకుండా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయితే ఒక్కటి ఓడినా రేసు నుంచి తప్పుకుని ఇంటిముఖం పట్టక తప్పదు. హైదరాబాద్, పంజాబ్ కంటే దిల్లీకే ఛాన్సులు అధికం. నెట్‌రన్‌రేట్ ఎక్కువ ఉండటం కలిసొస్తుంది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్‌లు ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
మిగిలిన మ్యాచ్‌లు..
* హైదరాబాద్: కోల్‌కతా, ముంబయి, పంజాబ్
* దిల్లీ: రాజస్థాన్, పంజాబ్, ముంబయి
* పంజాబ్: హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు
అద్భుతాలే జరగాలి..
పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచిన ముంబయి (4) ప్లేఆఫ్స్ చేరే అవకాశమే లేదు. మరోవైపు తొమ్మిదో స్థానంలో ఉన్న చెన్నై (8).. అద్భుతాలు జరిగితే తప్ప టాప్-4లో నిలవదు. ఇక ఎనిమిదిలో ఉన్న పంజాబ్ (10), ఏడులో ఉన్న కోల్‌కతా (10) ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో శక్తికి మించి రాణించాలి. అవి విజయం సాధించినా ఇతర జట్లతో రన్‌రేట్ పరంగా మెరుగ్గా ఉండాలి.
మిగిలిన మ్యాచ్‌లు..
* చెన్నై: ముంబయి, గుజరాత్, రాజస్థాన్
* కోల్‌కతా: హైదరాబాద్, లఖ్‌నవూ
* ముంబయి: చెన్నై, హైదరాబాద్, దిల్లీ
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Talasani: కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. మేం కూడా సిద్ధమే: తలసాని
-
India News
Manipur landslide: 27కు చేరిన మణిపుర్ మృతులు.. 20 మంది జవాన్లే..!
-
General News
ED: మధుకాన్ గ్రూప్ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ
-
Sports News
IND vs ENG: యువరాజ్ సింగ్‌ను గుర్తుచేసిన బుమ్రా
-
General News
Telangana News: తెలంగాణలో మరో 1,663 ఉద్యోగాల భర్తీకి అనుమతి
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!