T20 World Cup: దిగ్గజ జోడీ నిలబెట్టేనా?

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌కు జతగా కోహ్లీని ఓపెనర్‌గా ఆడించాలని మొదటి నుంచి డిమాండ్లు వినిపించాయి. అందుకు తగ్గట్లే ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరే ఇన్నింగ్స్‌ ఆరంభించారు. కోహ్లి త్వరగానే ఔటైనా.. ఈ జోడీ ఓపెనింగ్‌ చేయడం వల్ల రాబోయే మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రయోజనం దక్కే అవకాశముంది.

Published : 06 Jun 2024 03:54 IST

టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌కు జతగా కోహ్లీని ఓపెనర్‌గా ఆడించాలని మొదటి నుంచి డిమాండ్లు వినిపించాయి. అందుకు తగ్గట్లే ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఈ ఇద్దరే ఇన్నింగ్స్‌ ఆరంభించారు. కోహ్లి త్వరగానే ఔటైనా.. ఈ జోడీ ఓపెనింగ్‌ చేయడం వల్ల రాబోయే మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రయోజనం దక్కే అవకాశముంది. కోహ్లి ఓపెనర్‌గా ఆడటం వల్ల జట్టులో శివమ్‌ దూబెకు చోటు దక్కింది. అతనితో పాటు హార్దిక్, అక్షర్, జడేజా రూపంలో నలుగురు ఆల్‌రౌండర్లు జట్టులో ఉన్నారు. దీంతో బౌలింగ్, బ్యాటింగ్‌లో కావాల్సినన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అలాగే బ్యాటింగ్, బౌలింగ్‌ లోతు కూడా పెరిగింది. ఈ ఏడాది ఐపీఎల్‌ సీజన్‌లో ఆర్సీబీ ఓపెనర్‌గా కోహ్లి 741 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌కు ముందు వరకూ అంతర్జాతీయ టీ20ల్లో ఓపెనర్‌గా కోహ్లి 9 మ్యాచ్‌ల్లో 57.14 సగటు, 161.29 స్ట్రైక్‌రేట్‌తో 400 పరుగులు చేశాడు. చివరగా 2022 ఆసియా కప్‌లో అఫ్గానిస్థాన్‌పై సెంచరీ సాధించాడు. ఇక రోహిత్‌- కోహ్లి గతంలో ఒకసారి ఓపెనర్లుగా ఆడినప్పుడు 2021లో ఇంగ్లాండ్‌పై టీ20లో 94 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్నారనే అంచనాల నేపథ్యంలో మరోసారి ఇన్నింగ్స్‌ ఆరంభించేందుకు జతకట్టిన రోహిత్, కోహ్లి జట్టుకు శుభారంభాలను అందించి కప్‌ దిశగా నడిపించాలన్నది అభిమానుల కోరిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు