ICC: ఐసీసీ క్రికెటర్స్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2022.. విజేతలు వీరే

2022 సంవత్సరానికి సంబంధించి ఐసీసీ క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డులను ఐసీసీ (ICC) వెల్లడించింది.  

Updated : 26 Jan 2023 17:07 IST

ఇంటర్నెట్ డెస్క్: 2022 సంవత్సరానికిగాను క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డులను ఐసీసీ (ICC) ప్రకటించింది. మెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ ఎంపికగా.. మహిళల క్రికెట్‌లో ఇంగ్లాండ్‌ ఆల్‌రౌండర్‌ నాట్‌ స్కివర్‌ ఎంపికైంది. 2022 సంవత్సరానికి సంబంధించి వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డులు కూడా వీరినే వరించాయి. 2021లోనూ బాబర్‌ అజామ్‌ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్ అవార్డును అందుకున్నాడు. 2022లో మూడు ఫార్మాట్లలో కలిపి 44 మ్యాచ్‌లు ఆడిన బాబర్‌ అజామ్‌ 54.12 సగటుతో 2,598 పరుగులు చేశాడు. ఇందులో ఎనిమిది సెంచరీలు, 15 అర్ధ సెంచరీలున్నాయి. ఉమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా నిలిచిన నాట్ స్కివర్‌ గతేడాది 17 మ్యాచ్‌ల్లో 833 పరుగులు చేసి 11 వికెట్లు పడగొట్టి ఎంపికైంది. వన్డే క్రికెటర్‌ ఆఫ్ ది ఇయర్‌ అవార్డు కూడా ఈమెనే వరించింది. 

టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా బెన్‌ స్టోక్స్‌..

ఇంగ్లాండ్‌ టెస్టు కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. జానీ బెయిర్‌ స్టో (ఇంగ్లాండ్‌), ఉస్మాన్‌ ఖవాజా (ఆస్ట్రేలియా), కగిసో రబాడ (దక్షిణాఫ్రికా)లను వెనక్కినెట్టి స్టోక్స్‌ ఈ అవార్డును దక్కించుకున్నాడు. గతేడాది టెస్టుల్లో బెన్‌ స్టోక్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన కనబరిచాడు. 15 మ్యాచ్‌ల్లో 36.25 సగటుతో 870 పరుగులు చేయడమే కాకుండా 26 వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్‌ కెప్టెన్‌గా కూడా సక్సెస్‌ అవుతున్నాడు. ఇప్పటివరకు అతడు 10 టెస్టులకు నాయకత్వం వహించగా.. తొమ్మిదింటిలో ఇంగ్లాండ్‌ విజయం సాధించింది.

పురుషుల విభాగంలో అవార్డులు  

 • ఐసీసీ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌- బాబర్‌ అజామ్‌ (పాకిస్థాన్‌)
 • ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ -బెన్‌ స్టోక్స్‌ (ఇంగ్లాండ్)
 • ఐసీసీ వన్డే క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- బాబర్‌ అజామ్‌ (పాకిస్థాన్‌)
 • ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌-సూర్యకుమార్‌ యాదవ్‌ (భారత్)
 • ఐసీసీ ఎమర్జింగ్ (వర్ధమాన) ప్లేయర్ ఆఫ్‌ ది ఇయర్‌- మార్కో జాన్‌సెన్ (దక్షిణాఫ్రికా) 
 • ఐసీసీ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- గెర్హార్డ్ ఎరాస్మస్ (నమీబియా) 

మహిళల విభాగంలో 

 • ఐసీసీ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌- నాట్‌ స్కివర్‌ (ఇంగ్లాండ్)
 • ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌- నాట్‌ స్కివర్‌ (ఇంగ్లాండ్)
 • ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌- తాలియా మెక్‌గ్రాత్‌ (ఆస్ట్రేలియా)  
 • ఐసీసీ ఎమర్జింగ్ (వర్ధమాన) ప్లేయర్ ఆఫ్‌ ది ఇయర్‌-రేణుక సింగ్‌ (భారత్) 
 • ఐసీసీ అసోసియేట్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌- ఈషా ఓజా (యూఏఈ)

ఐసీసీ ఉత్తమ టెస్టు జట్టు: (పురుషుల)

బెన్‌ స్టోక్స్‌ (కెప్టెన్), బ్రాత్‌వైట్‌,మార్కస్‌ లబుషేన్‌, బాబర్‌ అజామ్‌, జానీ బెయిర్‌ స్టో, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), పాట్‌ కమిన్స్‌, కగిసో రబాడ, నాథన్‌ లియోన్‌, జేమ్స్‌ అండర్సన్‌.

ఐసీసీ ఉత్తమ వన్డే జట్టు: 

బాబర్‌ అజామ్‌ (కెప్టెన్‌),ట్రావిస్ హెడ్, షాయ్‌ హోప్, టామ్‌ లాథమ్‌ (వికెట్ కీపర్), శ్రేయస్‌ అయ్యర్‌, సికిందర్‌ రజా, మెహదీ హసన్‌ మిరాజ్‌, అల్జారీ జోసెఫ్‌, మహమ్మద్‌ సిరాజ్‌, ట్రెంట్ బౌల్ట్. ఆడమ్‌ జంపా.

ఐసీసీ ఉత్తమ టీ20 జట్టు: 

జోస్‌ బట్లర్‌ (వికెట్‌కీపర్, కెప్టెన్‌), మహమ్మద్‌ రిజ్వాన్‌, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్‌ యాదవ్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, సికిందర్‌ రజా, హార్దిక్ పాండ్య, సామ్‌ కరన్‌, వానిందు హసరంగ, హారీస్‌ రవూఫ్‌, జోష్‌ లిటిల్‌.

ఐసీసీ ఉత్తమ వన్డే జట్టు: (మహిళల)

హర్మన్‌ ప్రీత్ కౌర్ (కెప్టెన్), అలిస్సా హీలీ (వికెట్‌కీపర్), స్మృతి మంధాన, లారా వోల్వార్డ్ట్, నాట్‌ స్కివర్, బెత్ మూనీ,  అమేలియా కెర్, సోఫీ ఎక్లెస్‌స్టోన్,  అయాబొంగా ఖాకా, రేణుక సింగ్, షబ్నిమ్ ఇస్మాయిల్. 

ఐసీసీ ఉత్తమ టీ20 జట్టు:

స్మృతి మంధాన, బెత్ మూనీ, సోఫీ డివినీ (కెప్టెన్‌), ఆష్‌ గార్డ్రనర్, తాలియా మెక్‌గ్రాత్‌, నిదా దార్‌, దీప్తి శర్మ, రిచా ఘోష్‌ (వికెట్ కీపర్), సోఫీ ఎక్లెస్టోన్, ఇనోక రణవీర, రేణుక సింగ్. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని