WPL: ఎట్టకేలకు బెంగళూరు విజయం.. యూపీపై 5 వికెట్ల తేడాతో గెలుపు
డబ్ల్యూపీఎల్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBw)కు ఎట్టకేలకు విజయం. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. యూపీ వారియర్స్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ముంబయి: డబ్ల్యూపీఎల్ (WPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBw)కు ఎట్టకేలకు విజయం. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆర్సీబీ.. యూపీ వారియర్స్‌పై 5 వికెట్ల తేడాతో నెగ్గి టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. బెంగళూరు బౌలర్ల దెబ్బకు తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ జట్టు.. 19.3 ఓవర్లలో 135 పరుగులకే ఆలౌటైంది. ఈ స్వల్ప లక్ష్యాన్ని స్మృతి మంధాన సేన.. 18 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సోఫీ డివైన్ (14), స్మృతి మంధాన (0), ఎల్లీస్ పెర్రీ (10) విఫలమవ్వగా.. కనికా అహుజా (46; 30 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. హేథర్ నైట్ (24), రిచా ఘోష్ (31*; 32 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేశారు. యూపీ బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. గ్రేస్ హారిస్, దేవికా వైద్య, సోఫీ ఎకిల్ స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ బ్యాటర్లలో గ్రేస్ హారిస్ (46; 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. కిరణ్ నవ్‌గిరె (22), దీప్తి శర్మ (22) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో ఎల్లీస్ పెర్రీ మూడు వికెట్లు పడగొట్టగా.. సోఫీ డివైన్, ఆశా శోభనా రెండేసి వికెట్లను తమ ఖాతాలో వేసుకున్నారు. మేఘన్ స్కట్, శ్రేయంకా పాటిల్ తలో వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Injury: గాయం ‘స్మార్ట్’గా మానిపోతుంది
-
Politics News
Upendar Reddy: కమ్యూనిస్టులకు ఓట్లేసే రోజులు పోయాయ్ ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
-
World News
Joe Biden: ‘చైనాను అభినందిస్తున్నా.. ’: బైడెన్ వీడియో వైరల్
-
India News
Hand Writing: పెన్ను పెడితే.. పేపర్‌పై ముత్యాలే
-
Crime News
Hyderabad: కుమారుల అనారోగ్యంపై మనస్తాపం.. పిల్లలకు విషమిచ్చి దంపతుల ఆత్మహత్య
-
India News
పెళ్లి కోసం 4 గంటల పెరోల్.. వివాహం చేసుకుని మళ్లీ జైలుకెళ్లిన వరుడు