Yuzvendra Chahal: చాహల్‌ను గిరగిరా తిప్పేసిన లేడీ రెజ్లర్‌.. వీడియో వైరల్‌

టీమ్‌ ఇండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ను రెజ్లర్‌ సంగీత ఫొగాట్‌ తన భూజాలపై ఎత్తుకుని గాల్లో గిరగిరా తిప్పేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Published : 03 Mar 2024 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత రెజ్లర్‌ సంగీత ఫొగాట్‌ (Sangeeta Phogat) టీమ్‌ ఇండియా క్రికెటర్‌ యుజ్వేంద్ర చాహల్‌ (Yuzvendra Chahal)కు మధ్య జరిగిన ఒక ఫన్నీ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వీరిద్దరు ఇటీవల ‘ఝలక్‌ దిఖ్లా జా ర్యాప్‌ అప్‌’ పార్టీలో కలుసుకున్నారు. ఆ సమయంలో చాహల్‌ను సంగీత భుజాలపై ఎత్తుకుని గిరగిరా తిప్పేసింది. నాకు తల తిరుగుతోంది నన్ను కిందకు దించేయ్‌ అంటూ చాహల్‌ అభ్యర్థించాడు. వారి మధ్య జరిగిన ఈ సంఘటన నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై స్పందించిన నెటిజన్లు స్మైలీ సింబల్స్‌ను పోస్టు చేశారు. కాగా.. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ నుంచి చాహల్‌ను బీసీసీఐ తొలగించింది. త్వరలో జరగనున్న ఐపీఎల్‌కు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని