Telangana News: తెలంగాణలో ఎనిమిది మంది ఐఏఎస్‌ల బదిలీ

Eenadu icon
By Telangana News Team Published : 31 Oct 2025 18:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: తెలంగాణలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఎనిమిది మంది ఐఏఎస్‌ అధికారుల్ని బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫ్లాగ్‌షిప్‌ అభివృద్ధి, సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక సీఎస్‌గా సవ్యసాచి ఘోష్‌ నియమితులయ్యారు. అలాగే, సంక్షేమశాఖ ప్రత్యేక సీఎస్‌గానూ ఆయన కొనసాగనున్నారు. గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి, కమిషనర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. రవాణాశాఖ కమిషనర్‌గా కె.ఇలంబర్తిని నియమించిన ప్రభుత్వం.. పశుసంవర్థక శాఖ కార్యదర్శిగా అదనపు బాధ్యతలను ఆయనకు అప్పగించింది.

మెట్రోపాలిటన్‌ అర్బన్‌ డెవలప్‌మెంట్ కార్యదర్శి బాధ్యతలు సీఎస్‌ వద్దే ఉంచింది. జీఏడీ కార్యదర్శిగా ఇ.శ్రీధర్‌కు అదనపు బాధ్యతలు ఇచ్చింది. టీజీ ఆయిల్‌ఫెడ్‌ ఎండీగా యాస్మిన్‌ బాషాకు అదనపు బాధ్యతలు అప్పగించిన సర్కార్‌.. ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్‌గా జి.జితేందర్‌రెడ్డిని నియమించింది. అలాగే, ఎస్సీ సహకార సంస్థ ఎండీగా ఆయనకు అదనపు బాధ్యతలను అప్పగించింది. అభివృద్ధి సంక్షేమ పనుల అమలు విభాగం ప్రత్యేక కార్యదర్శిగా సైదులుకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు