Telangana News: అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్‌ చేయాలి: షబ్బీర్‌ అలీ

రాహుల్‌ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి  చేసిన వ్యాఖ్యాలను  కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ ఖండించినట్లు పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ..

Published : 14 Feb 2022 01:18 IST

హైదరాబాద్‌: రాహుల్‌ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి  చేసిన వ్యాఖ్యాలను  కాంగ్రెస్‌ రాజకీయ వ్యవహారాల కమిటీ ఖండించినట్లు పీఏసీ కన్వీనర్‌ షబ్బీర్‌ అలీ, పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌ చిన్నారెడ్డి తెలిపారు. తక్షణమే ప్రధాని మోదీ అస్సాం ముఖ్యమంత్రిని బర్తరఫ్‌ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అస్సాం సీఎంపై రేపు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు చేయనున్నట్టు చెప్పారు. కేసులు నమోదు చేయకపోతే పోలీస్‌ స్టేషన్ల ఎదుట ధర్నా చేస్తామని వెల్లడించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తారని తెలిపారు. 18న మహిళా నేతలు మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారని వెల్లడించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో 31లక్షల డిజిటల్‌ సభ్యత్యాలు నమోదు చేశామని, 50లక్షల వరకు సభ్యత్వాలు నమోదు చేస్తామని వివరించారు. ప్రధాని మోదీకి తెలంగాణ చరిత్ర తెలియకుండానే పార్లమెంట్‌లో మాట్లాడారని ఆరోపించారు. 2014లో పార్లమెంట్‌కు వచ్చిన మోదీకి .. పార్లమెంట్‌ నియమావళి గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. తెలంగాణను ఆంధ్రాలో కలుపుతారనే భయం తమకుఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని