మద్యం దుకాణాల కేటాయింపు పూర్తి

Eenadu icon
By Telangana News Desk Published : 28 Oct 2025 03:22 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తైంది. వచ్చిన దరఖాస్తుల నుంచి సోమవారం లక్కీ డ్రాల ద్వారా జిల్లాల కలెక్టర్లు దుకాణాలను ఎంపిక చేశారు. రాష్ట్రంలో 2,620 దుకాణాలకు మొత్తం 95,137 దరఖాస్తులు వచ్చాయి. తక్కువ దరఖాస్తులు రావడంతో 19 షాపులకు ఈ నెల 28న మరోమారు నోటిఫికేషన్‌ విడుదల చేసి, నవంబరు 3న డ్రా తీయనున్నారు. ప్రస్తుతం 2,601 దుకాణాలకు లక్కీడ్రా నిర్వహించారు. దుకాణాలు పొందిన వారు నవంబరు 2025 నుంచి అక్టోబరు 2027 వరకూ వ్యాపారం నిర్వహించుకోవచ్చు.

చనిపోయాక.. లక్కీ డ్రాలో పేరు

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: నల్గొండ జిల్లాకేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కలెక్టర్‌ ఇలా త్రిపాఠి డ్రా పద్ధతిన మద్యం దుకాణాదారుల ఎంపిక నిర్వహించారు. లక్కీడ్రాలో ఓ మృతుడికి అవకాశం దక్కింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోని మద్యం షాపు(63)నకు మండల పరిధిలోని గోపులాపురం గ్రామానికి చెందిన కాసాని అశోక్‌(38) ఈనెల 18న జిల్లాకేంద్రంలో టెండరు దరఖాస్తు సమర్పించి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అతడిని చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రికి తరలించగా.. సోమవారం మృతి చెందారు. నిబంధనల ప్రకారం మృతుని కుటుంబ సభ్యుల్లో ఒకరికి దుకాణం కేటాయించనున్నట్లు ఆబ్కారీశాఖ సూపరింటెండెంట్‌ సంతోష్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని