హైదరాబాద్‌లో మెక్‌డొనాల్డ్‌ జీసీసీ

Eenadu icon
By Telangana News Desk Updated : 29 Oct 2025 06:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

తొలిదశలో 500 మందికి ఉద్యోగావకాశాలు

దశలవారీగా 2,000 మందికి ఉపాధి
నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: ‘మెక్‌డొనాల్డ్‌’ కంపెనీ తన కొత్త అంతర్జాతీయ కార్పొరేట్‌ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెలకొల్పనుంది. హైటెక్‌ సిటీలోని ఆర్‌ఎంజెడ్‌ నెక్సిటీలో మెక్‌డొనాల్డ్‌ నెలకొల్పుతున్న శాశ్వత ‘గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌(జీసీసీ)’ నాలుగు అంతస్తుల్లో 1,56,496 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు బుధవారం(29న) దీన్ని ప్రారంభించనున్నారు. ఈ కొత్త కార్పొరేట్‌ ఆఫీసు.. ఫైనాన్స్, హెచ్‌ఆర్, డేటా ఎనలిటిక్స్, ఏఐ వంటి కార్పొరేట్‌ కార్యకలాపాలకు సంబంధించిన గ్లోబల్‌ టీమ్‌లను ఆకర్షించనుంది. హైదరాబాద్‌ను గ్లోబల్‌ టెక్నాలజీ హబ్‌గా మరింత బలోపేతం చేయడంలో ఈ జీసీసీ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీ హైదరాబాద్‌ ఆఫీసులో వివిధ రకాల ఉద్యోగాల కోసం ఇప్పటికే చురుగ్గా నియామక ప్రక్రియ చేపట్టింది. తొలిదశలో 500 మందికి ఉద్యోగావకాశాలు, దశలవారీగా సుమారు 2,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ‘‘ఇటీవల కాలంలో ఇన్నోవేషన్, కేపబిలిటీ సెంటర్లను ఆకర్షించే ప్రముఖ గమ్యస్థానంగా తెలంగాణ అవతరించింది. వాన్‌గార్డ్, హైనీకెన్, ఎలీ లిల్లీ వంటి గ్లోబల్‌ బ్రాండ్లు ఇక్కడ జీసీసీలను నెలకొల్పాయి. ఎక్స్‌ఫినో తాజా నివేదిక ప్రకారం.. గత మూడేళ్లలో దేశంలో స్థాపించిన కొత్త జీసీసీల్లో 40 శాతం హైదరాబాద్‌కు వచ్చాయి. ఈ విషయంలో బెంగళూరు(33 శాతం)ను అధిగమించాం. హైదరాబాద్‌ గ్లోబల్‌ ఆఫీసులో మెక్‌డొనాల్డ్‌ వర్క్‌ఫోర్స్‌.. రోజూ 43,000కుపైగా రెస్టారెంట్లు, 65 మిలియన్ల కస్టమర్లపై ప్రభావం చూపే సొల్యూషన్లపై పనిచేస్తుంది’’ అని ప్రభుత్వం తెలిపింది. దీనికి అదనంగా మెక్‌డొనాల్డ్‌ తన సామాజిక ప్రభావ కార్యక్రమమైన రోనాల్డ్‌ మెక్‌డొనాల్డ్‌ హౌస్‌ ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌కు విస్తరించినట్లు ప్రకటించింది. ఇది అనారోగ్యంతో ఉన్న పిల్లలు, వారి కుటుంబాలకు ఉచితంగా కేర్‌ సెంటర్లు, రూములు, హౌస్‌లు అందించే గ్లోబల్‌ సంస్థ.

Tags :
Published : 29 Oct 2025 04:18 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు