Gadwala Vijayalakshmi: హైదరాబాద్‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి ఫోన్‌లో వేధింపులు

Eenadu icon
By Telangana News Team Published : 07 Jun 2025 21:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మికి ఫోన్‌ చేసి ఓ దుండగుడు వేధించాడు. అర్ధరాత్రి ఫోన్‌లు చేస్తూ బెదిరింపులకు పాల్పడ్డాడు. మేయర్‌తో పాటు, ఆమె తండ్రి కేశవరావు అంతు చూస్తానంటూ వాయిస్‌ మెసేజ్‌లు పెట్టాడు. బోరబండలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన సర్దార్‌కి చెందిన వ్యక్తిగా చెప్పుకొచ్చాడు. అసభ్యకరమైన పదజాలంతో బెదిరిస్తున్నాడంటూ మేయర్‌ పీఆర్‌వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బంజారాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని