Fake poster Alert: వాట్సప్‌, ఫోన్‌ కాల్స్‌కు కొత్త రూల్స్ అంటూ పోస్టర్‌.. స్పందించిన పోలీసులు

Eenadu icon
By Telangana News Team Published : 28 Oct 2025 15:41 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్ డెస్క్‌: ఈ మధ్య జరుగుతోన్న కొన్ని ఘటనల దృష్ట్యా వాట్సప్‌, ఫోన్‌ కాల్స్‌కు సంబంధించి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయంటూ జరుగుతోన్న ప్రచారంపై హైదరాబాద్‌ పోలీసులు(Hyderabad Police) స్పందించారు. తాము విడుదల చేసినట్లుగా జరుగుతోన్న ప్రచారాన్ని ఖండించారు. అన్ని ఫోన్‌ కాల్స్‌ రికార్డ్‌ చేసి సేవ్‌ చేస్తారని, సామాజిక మాధ్యమ ఖాతాలన్నీ పర్యవేక్షిస్తారంటూ సర్క్యులేట్ అవుతున్న నకిలీ పోస్టర్‌ను ఎవరూ నమ్మొద్దని కోరారు. ఈ మేరకు హైదరాబాద్‌ పోలీసులు ‘ఎక్స్‌’లో పోస్టు పెట్టారు. (Fact Check

‘‘తప్పుడు సమాచారంతో డిజిటల్‌ పోస్టర్‌ ఒకటి సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్‌ అవుతోంది. అందులో ఉన్న సమాచారం పూర్తిగా అవాస్తవం. పోలీసులు దాన్ని విడుదల చేయలేదు. ధ్రువీకరించుకోకుండా అలాంటి కంటెంట్‌ను ఎవరూ షేర్‌ లేదా ఫార్వార్డ్‌ వంటివి చేయొద్దు. ఇలాంటి నకిలీ సమాచారం గురించి మీకు తెలిస్తే ఫిర్యాదు చేయండి’’అని ప్రజలను కోరారు. ఈ ట్వీట్‌ను హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ #FactCheck #FakePoster ట్యాగ్‌లతో  రీట్వీట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు