Bandi sanjay: భాజపా బలపరిచిన అభ్యర్థిని ఏకగ్రీవం చేస్తే రూ.10లక్షలు: బండి సంజయ్

హైదరాబాద్: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో కేంద్ర మంత్రి, భాజపా నేత బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో భాజపా బలపరిచిన అభ్యర్థులను సర్పంచులుగా ఏకగ్రీవం చేస్తే రూ. 10లక్షలు ప్రోత్సాహకంగా నిధులు ఇస్తానని వెల్లడించారు. ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు డబ్బులిచ్చే అంశంలో తాను మాట తప్పనన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో పొరపాటు చేస్తే.. ఐదేళ్లు నరకయాతన అనుభవించాల్సి వస్తుందన్నారు.
పార్లమెంట్ సభ్యుడిగా తన వద్ద ఎంపీ లాడ్స్ నిధులు ఉన్నాయని, కేంద్రంతో మాట్లాడి మరిన్ని నిధులు తీసుకొస్తానని బండి సంజయ్ చెప్పారు. గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం సర్పంచ్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.5లక్షలు ఇస్తానని చెప్పి మాట తప్పిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాంటి వాగ్దానాలు చేసి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఆ పార్టీల మాయలో పడొద్దని, భాజపా బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

ఫిల్మ్మేకర్కు ఇంతకన్నా అవమానం ఉంటుందా?: వేణు ఊడుగుల ఎమోషనల్ స్పీచ్
-

తెలంగాణలో మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా? నిజమెంత?
-

ఉక్రెయిన్-రష్యా శాంతి ఒప్పందం ఖరారైనట్లేనా?
-

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
-

ఇలాగే ఉంటే 2050 నాటికి సగం మంది ఊబకాయులే..!
-

త్వరలో అన్ని పోలీస్స్టేషన్లకు కొత్తవాహనాల కోసం చర్యలు: హోంమంత్రి అనిత


