TGPSC Group 1: రేపు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌

రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 9న (ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

Updated : 08 Jun 2024 06:22 IST

అర గంట ముందు గేట్ల మూసివేత

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ప్రిలిమినరీ పరీక్ష ఈనెల 9న (ఆదివారం) ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరగనుంది. ఓఎంఆర్‌ పద్ధతిలో నిర్వహించే ఈ పరీక్ష కోసం టీజీపీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4.03 లక్షల మంది హాజరుకానున్న ప్రిలిమ్స్‌కు 895 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అత్యధికంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలోనే 105 కేంద్రాలున్నాయి. ఉదయం 9గంటల నుంచి అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతిస్తామని చెప్పిన కమిషన్‌... పరీక్ష ప్రారంభానికి అరగంట ముందు అంటే ఉదయం 10 గంటల తర్వాత గేట్లు మూసివేస్తామని స్పష్టంచేసింది. అభ్యర్థులంతా హాల్‌టికెట్‌పై గత మూడు నెలల్లో తీసుకున్న పాస్‌పోర్టు ఫొటో అంటించాలని, హాల్‌టికెట్‌తోపాటు ఒరిజినల్‌ ఫొటో గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి తీసుకురావాలని సూచించింది. అభ్యర్థులంతా బయోమెట్రిక్‌ తప్పనిసరి ఇవ్వాలని, బయోమెట్రిక్‌ ఇవ్వని అభ్యర్థుల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయబోమంది. గ్రూప్‌-1 పరీక్షలో  పాటించాల్సిన సూచనలపై ప్రతిరోజూ అభ్యర్థులకు కమిషన్‌ ఇప్పటికే ఎస్‌ఎంఎస్‌ల రూపంలో అప్రమత్తం చేస్తోంది. హాల్‌టికెట్, ప్రశ్నపత్రంపై ముద్రించిన సూచనలు తప్పనిసరి పాటించాలని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు