AI City: హైదరాబాద్‌లో 200 ఎకరాల్లో ఏఐ సిటీ

కృత్రిమ మేధ(ఏఐ)లో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే సమున్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

Published : 18 May 2024 03:46 IST

రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్‌బాబు

నార్సింగి, న్యూస్‌టుడే: కృత్రిమ మేధ(ఏఐ)లో హైదరాబాద్‌ను ప్రపంచంలోనే సమున్నత స్థానంలో నిలపడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ మేరకు నగరంలో 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శుక్రవారం ఉదయం నార్సింగిలో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ ఆధ్వర్యంలో గ్రీన్‌ యాన్యువల్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ కౌన్సిల్‌ పదో సమ్మిట్‌-2024 నిర్వహించారు. సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ... ‘‘ఐటీ పరిశ్రమలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నాం. హైదరాబాద్‌ను ఏఐ నగరంగా, ప్రపంచ ఏఐ రాజధానిగా తీర్చిదిద్దుతాం. జులైలో అంతర్జాతీయ ఏఐ సదస్సును నగరంలోనే నిర్వహిస్తాం. అందులో సంబంధిత రంగానికి చెందిన అంతర్జాతీయ నిపుణులు పాల్గొంటారు. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి స్కిల్‌ యూనివర్సిటీని సైతం స్థాపిస్తాం. దీనికి మేధావుల నుంచి సూచనలను ఆహ్వానించాం. వర్సిటీకి సంబంధించిన విధివిధానాలు రూపొందిస్తాం. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో సమూల మార్పులు చేసేందుకే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు’’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని