Hyderabad: 24 గంటలు.. 55 వేల మంది.. ముగిసిన చేప ప్రసాదం పంపిణీ

మృగశిర కార్తెను పురస్కరించుకొని హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బత్తిని కుటుంబసభ్యులు చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ ఆదివారం ఉదయం ముగిసింది.

Published : 10 Jun 2024 07:43 IST

హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో చేప ప్రసాదం వేస్తున్న బత్తిని కుటుంబసభ్యులు

అబిడ్స్, న్యూస్‌టుడే: మృగశిర కార్తెను పురస్కరించుకొని హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బత్తిని కుటుంబసభ్యులు చేపట్టిన చేప ప్రసాదం పంపిణీ ఆదివారం ఉదయం ముగిసింది. 24 గంటల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, బిహార్, ఒడిశా, యూపీ, ఛత్తీస్‌గఢ్, హరియాణా తదితర రాష్ట్రాలకు చెందిన 55,440 మంది ఉబ్బసం వ్యాధిగ్రస్థులు చేప ప్రసాదం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మైదానంలో పంపిణీ ముగియడంతో బత్తిని సోదరులు హైదరాబాద్‌ దూద్‌బౌలిలోని వారి ఇంట్లో పంపిణీ చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు