Ponnam Prabhakar: మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం ఆనవాయితీ: మంత్రి పొన్నం ప్రభాకర్‌

మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం తీసుకోవడం గత కొన్ని దశాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

Published : 09 Jun 2024 04:28 IST

చేప ప్రసాదం పంపిణీ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్, చిత్రంలో మత్స్య పారిశ్రామిక సమాఖ్య ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, 
సభాపతి గడ్డం ప్రసాద్, మేయర్‌ విజయలక్ష్మి తదితరులు 

అబిడ్స్, న్యూస్‌టుడే: మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం తీసుకోవడం గత కొన్ని దశాబ్దాల నుంచి ఆనవాయితీగా వస్తోందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో బత్తిని కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహించిన చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. బత్తిని కుటుంబం గత 150 ఏళ్లుగా ఏటా మృగశిర కార్తె రోజు ఉబ్బసం వ్యాధిగ్రస్థులకు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ఎంతోమంది చేప ప్రసాదం తీసుకోవడానికి వస్తుంటారని, అందుకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సదుపాయాలు కల్పించామని వివరించారు. అనంతరం మంత్రితోపాటు పలువురు ప్రజాప్రతినిధులు చేప ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్, హైదరాబాద్‌ నగర మేయర్‌ విజయలక్ష్మి, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌యాదవ్, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్, మత్స్య పారిశ్రామిక సమాఖ్య ఛైర్మన్‌ మెట్టు సాయికుమార్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు. చేప ప్రసాదం పంపిణీకి హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ సందర్శించారు. బద్రి విశాల్‌ పన్నాలాల్‌ పిట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాన్ని ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని