అనంత సంస్థకు జాతీయ అవార్డు

పర్యావరణహిత సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించినందుకు ఎక్సియన్‌ ఫ్రటెర్నా ఎకాలజీ సెంటర్‌కు(ఏఎఫ్‌) ఫిక్కీ అవార్డును ప్రకటించింది.

Published : 01 Dec 2022 05:04 IST

కేంద్ర మంత్రి తోమర్‌ చేతుల మీదుగా అందుకున్న సంస్థ డైరెక్టర్‌ మల్లారెడ్డి

ఈనాడు, దిల్లీ: పర్యావరణహిత సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించినందుకు ఎక్సియన్‌ ఫ్రటెర్నా ఎకాలజీ సెంటర్‌కు(ఏఎఫ్‌) ఫిక్కీ అవార్డును ప్రకటించింది. కరవు పీడిత అనంతపురం జిల్లాలో సాగు రంగంలో సుస్థిర వ్యవసాయ పద్ధతుల ప్రోత్సాహానికి ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ చేసిన కృషికి ఈ అవార్డు అందజేస్తున్నట్లు ఫిక్కీ ప్రకటించింది. దిల్లీలో బుధవారం జరిగిన కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌.. సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వై.వి.మల్లారెడ్డికి అవార్డును ప్రదానం చేశారు. అనంతరం డాక్టర్‌ మల్లారెడ్డి మాట్లాడుతూ.. అనంతపురం ప్రాంతంలో వర్షాలు లేక వ్యవసాయం సంక్షోభంలో ఉన్నప్పుడు మారుతున్న సాగు పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటలు మార్చుకునేలా ప్రోత్సహించడం, బహుళ పంటల విధానం, రక్షక తడులు, ఫాంపాండ్‌ల నిర్మాణాన్ని ప్రోత్సహించినందుకు ఈ అవార్డు దక్కిందన్నారు. ఫిక్కీ పలు విభాగాలకు అవార్డులు ఇచ్చినా స్వచ్ఛంద సంస్థల విభాగంలో తమకు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈ అవార్డు తమ సిబ్బందికి దక్కుతుందని, ఈ స్ఫూర్తితో జాతీయ స్థాయిలో రైతులకు ఉపయోగపడే ఇంకా అనేక కార్యక్రమాలు చేపడతామని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని