కఠోర సాధన.. అమ్మ లాలన..!

ఓ వైపు ఉద్యోగాన్ని ఎలాగైనా సాధించాలనే తపన.. మరోవైపు చిన్నారులను లాలించాల్సిన బాధ్యత.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళలు.

Published : 06 Dec 2022 04:52 IST

ఓ వైపు ఉద్యోగాన్ని ఎలాగైనా సాధించాలనే తపన.. మరోవైపు చిన్నారులను లాలించాల్సిన బాధ్యత.. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకుసాగుతున్నారు ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న మహిళలు. ఈ నెల 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అభ్యర్థులు కఠోర సాధన చేస్తున్నారు. పసి పిల్లలు, చిన్నారులు ఉన్న అభ్యర్ధులు ఇంటి వద్ద వారిని వదిలి వెళ్లే అవకాశం లేక తమతో పాటు వారిని మైదానాలకు తీసుకొస్తున్నారు. ఓవైపు సాధన చేస్తూనే మధ్యలో పిల్లల ఆలనాపాలనా చూసుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లా బడంగ్‌పేట్‌ మున్సిపల్‌ మైదానంలో సోమవారం కనిపించిందీ చిత్రం

 ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని