ఎన్టీఆర్‌ స్టేడియంలో 22 నుంచి పుస్తక ప్రదర్శన

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు.

Published : 07 Dec 2022 04:46 IST

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ జాతీయ స్థాయి పుస్తక ప్రదర్శనగా ఎదిగిందని సాంస్కృతిక, పర్యాటకశాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడు, సాహిత్య అకాడమి ఛైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ మంగళవారం మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. ఈనెల 22 నుంచి జనవరి 1 వరకు పుస్తక ప్రదర్శన ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించేందుకు అనుమతి కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించి ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రదర్శనలో అన్ని భాషల పుస్తకాలతో పాటు తెలుగు భాషాసంస్కృతులు, తెలంగాణ చరిత్రకు సంబంధించిన గ్రంథాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, బుక్‌ ఫెయిర్‌ ఉపాధ్యక్షులు కోయ చంద్రమోహన్‌ ఉన్నారు.

సాహిత్య అకాడమీ కార్యదర్శిగా బాలాచారి

తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా ఎన్‌.బాలాచారి నియమితులయ్యారు. మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని