తెలంగాణ భవన్‌లో గణతంత్ర వేడుకలు

కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అప్రతిహత ప్రగతిని సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని హోంమంత్రి మహమూద్‌ అలీ, భారాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు.

Published : 27 Jan 2023 04:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేసీఆర్‌ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అప్రతిహత ప్రగతిని సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని హోంమంత్రి మహమూద్‌ అలీ, భారాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం వారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ నమూనా పాలన దేశమంతా కావాలని ప్రజలు కోరుకుంటున్నారని వారు పేర్కొన్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్‌, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితర పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని