ఏడు బిల్లుల ఎదురుచూపు!

శాసనసభ మరోసారి సమావేశాలకు సిద్ధమవుతుండగా గతంలో సభలో ఆమోదించిన ఏడు బిల్లులు గవర్నర్‌ సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాయి.

Published : 28 Jan 2023 05:05 IST

గతంలోనే ఆమోదించిన ఉభయ సభలు
మరోమారు సమావేశాలకు సిద్ధమవుతున్నా.. పడని గవర్నర్‌ ఆమోదముద్ర

ఈనాడు, హైదరాబాద్‌: శాసనసభ మరోసారి సమావేశాలకు సిద్ధమవుతుండగా గతంలో సభలో ఆమోదించిన ఏడు బిల్లులు గవర్నర్‌ సమ్మతి కోసం ఎదురుచూస్తున్నాయి. గత ఏడాది సెప్టెంబరు 13న ఉభయ సభలు ఆమోదించిన ఎనిమిది బిల్లుల్లో ఒక్క దానికి మాత్రమే రాజ్‌భవన్‌ ఆమోదముద్ర వేయడంతో మిగతావి చట్ట రూపం దాల్చలేదు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు బిల్లుపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆ శాఖ ఉన్నతాధికారులు గవర్నర్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ బిల్లు కూడా గవర్నర్‌ కార్యాలయం పరిశీలనలో ఉంది.

ఉభయ సభల ఆమోదం పొంది..
గవర్నర్‌ సమ్మతి కోసం ఎదురుచూస్తున్నవి..

* ప్రస్తుతం ఎన్నికైన ఛైర్‌పర్సన్‌, వైస్‌ఛైర్‌పర్సన్‌, మేయర్‌, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే మూడేళ్ల కాలపరిమితిని నాలుగేళ్లకు పెంచుతూ బిల్లు. జీహెచ్‌ఎంసీతోపాటు ఇతర కార్పొరేషన్లలో కోఆప్షన్‌ సభ్యుల పెంపు..

* హైదరాబాద్‌ ముషీరాబాద్‌లోని అజామాబాద్‌ పారిశ్రామికప్రాంత భూములను క్రమబద్ధీకరించేందుకు వీలుగా అజామాబాద్‌ పారిశ్రామిక ప్రాంత కౌలు రద్దు చట్ట సవరణ బిల్లు. 136 ఎకరాల భూమిని ప్రస్తుత మార్కెట్‌ ధర మేరకు క్రమబద్ధీకరించేలా చట్ట సవరణను ప్రతిపాదించారు.

* రాష్ట్ర అటవీ విశ్వవిద్యాలయానికి కులపతిగా ముఖ్యమంత్రి వ్యవహరించేలా చట్ట సవరణ బిల్లు.

* రాష్ట్రంలో మరికొన్ని ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుకు అనుమతిస్తూ చట్ట సవరణ బిల్లు.

* విశ్వవిద్యాలయాల్లో నియామకాలు చేపట్టేందుకు ఉమ్మడి బోర్డు ఏర్పాటు చేసేలా చట్ట సవరణ బిల్లు.

* పబ్లిక్‌ ఎంప్లాయిమెంట్‌ చట్ట సవరణ బిల్లు.

* తెలంగాణ మోటార్‌ వాహనాల ట్యాక్సేషన్‌ బిల్లు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు