ధాన్యరాశి తెలంగాణ
వానాకాలంలో ధాన్యం ఉత్పత్తి కోటి టన్నులు దాటింది. రాష్ట్ర ప్రభుత్వంతో పోటాపోటీగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు.
కోటిటన్నుల పైగా వడ్ల ఉత్పత్తి
పోటాపోటీగా కొనుగోళ్లు
64.30 లక్షల టన్నులు సేకరించిన ప్రభుత్వం
40 లక్షల టన్నులు కొన్న వ్యాపారులు
ఈనాడు, హైదరాబాద్: వానాకాలంలో ధాన్యం ఉత్పత్తి కోటి టన్నులు దాటింది. రాష్ట్ర ప్రభుత్వంతో పోటాపోటీగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా బియ్యానికి భారీగా డిమాండు ఉండటంతో వ్యాపారులు ముందడుగు వేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో అక్కడి వారు కూడా తెలంగాణలో కొనుగోళ్లు చేపట్టారు. వ్యాపారుల పోటీ పెరగడంతో ప్రభుత్వం తక్కువ మొత్తంలోనే సేకరించింది. ప్రస్తుత వానాకాల ధాన్యం కొనుగోళ్ల క్రతువు ముగిసింది. ప్రభుత్వం 64.30 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తే వ్యాపారులు సుమారు 40 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసినట్లు అంచనా. వానాకాలంలో సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గడిచిన ఏడాదితో పోలిస్తే మూడు లక్షల ఎకరాలు అదనం. ఈ నేపథ్యంలో 1.52 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు అంచనా వేశాయి. ఆ మేరకు దిగుబడి రానప్పటికీ కోటి టన్నులకుపైగా వచ్చినట్లు అధికార, అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. తొలిదశలో వరి నాట్లు వేసిన రైతులకు మంచి దిగుబడి వచ్చింది. జులైలో నాట్లు వేసిన వారికి దిగుబడి కొంత తగ్గినప్పటికీ ఆగస్టులో నాట్లు వేసిన రైతులకు పంట ఎక్కువగానే వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. 90 లక్షల నుంచి 1.12 కోట్ల టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేయగా.. 64.30 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది.
బియ్యానికి భారీగా డిమాండు...
దేశంలోని పలు రాష్ట్రాల్లో దిగుబడి తక్కువగా రావటంతో బియ్యానికి డిమాండు పెరిగింది. నూకలు, బియ్యం ఎగుమతులపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్రం సడలించటంతోనూ వ్యాపారులు భారీగా కొనుగోళ్లు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయంగా కూడా డిమాండు పెరిగింది. కరోనా కారణంగా చైనా, థాయ్‌లాండ్‌లో వరి సాగు, దిగుబడిపై ప్రభావం పడినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బియ్యం డిమాండు నేపథ్యంలో తొలిసారి రైతులకు కొంత మేర మంచి ధర లభించింది. సీజను ఆరంభంలో కొందరు వ్యాపారులు మునుపటి మాదిరిగానే తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఆ తరవాత ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావటంతో స్థానికంగా ఉన్నవారు కూడా రైతులకు అధిక ధర చెల్లించారు. గడిచిన రెండు సీజన్లకు సంబంధించి కస్టం మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పెద్ద మొత్తంలో పక్కదారి పట్టించారు. మరోపక్క రాష్ట్రంలో బియ్యం అక్రమాలపై కేంద్రం దృష్టి సారించిందన్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేందుకు అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు ఆ మేరకు వడ్లు కొనుగోలు చేసినట్లు వ్యాపారవర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. తెలంగాణ వ్యాపారులు 25 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేస్తే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వారు 15 లక్షల టన్నుల వరకు సేకరించినట్లు అంచనా. వ్యాపారుల్లో పోటీ పెరగటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. గడిచిన వానాకాలంతో పోలిస్తే సర్కారు తక్కువగానే కొనుగోలు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
ఐపీఎల్ పూర్తి షెడ్యూల్.. హైదరాబాద్‌లో మ్యాచ్‌లు ఎప్పుడంటే..
-
India News
శ్రీరామ నామాలు జమ చేస్తే.. పుణ్యం పంచే ఆధ్యాత్మిక బ్యాంక్!
-
World News
మొబైల్‌పై ఇంత వ్యామోహమా!..సెల్‌ఫోన్ పితామహుడు మార్టిన్ కూపర్ ఆవేదన
-
Crime News
పెళ్లి చేసుకోవాలని వేధింపులు.. యువకుణ్ని హతమార్చిన యువతి
-
Politics News
అఖండ హిందూ రాజ్యమే లక్ష్యం.. శోభాయాత్రలో ఎమ్మెల్యే రాజాసింగ్
-
Ts-top-news News
ఆర్టీసీ ప్రయాణికులపై టోల్ పెంపు వడ్డన?