ఫిబ్రవరిలో పోడు పట్టాల పంపిణీ

రాష్ట్రంలో పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు.

Published : 31 Jan 2023 04:31 IST

గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పోడు భూములకు ఫిబ్రవరిలో పట్టాలివ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారమిక్కడ అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సీఎస్‌ శాంతికుమారితో కలిసి ఆమె జిల్లా కలెక్టర్లు, అటవీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పోడుభూముల దరఖాస్తులు వచ్చిన గ్రామాల్లో గ్రామసభల ద్వారా  సర్వేను పూర్తిచేశామని మంత్రి తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరికి పోడు భూముల పట్టాలిస్తామని వెల్లడించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వడంలో స్థానిక ప్రజా ప్రతినిధులందరినీ భాగస్వామ్యం చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సూచించారు.  పరిశీలన ప్రక్రియ పూర్తి చేసి, ఫ్రిబవరి మొదటి వారానికి పట్టా పాసుపుస్తకాల్ని ముద్రించి సిద్ధంగా పెట్టుకోవాలని సీఎస్‌ శాంతికుమారి ఆదేశించారు. ఈ సమావేశంలో పీసీసీఎఫ్‌ డోబ్రియాల్‌, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టీనా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు