15 వరకు శివ మాలధారులకు ఉచిత స్పర్శ దర్శనం

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు.

Published : 03 Feb 2023 04:59 IST

శ్రీశైలం ఆలయం, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఈనెల 11 నుంచి 21వ తేదీ వరకు మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఈనెల 11 నుంచి 15 వరకు నిర్దిష్ట రోజుల్లో జ్యోతిర్ముడి ధరించిన శివ మాలధారులకు ఉచితంగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం కల్పిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం వేళల్లో ఇతర భక్తులతో పాటు శివ దీక్షలో ఉన్న భక్తులకు ఉచిత స్పర్శ దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు