విదేశీ సందర్శకులపై నిఘా విస్తృతం

విజిటింగ్‌ వీసాలతో తెలంగాణలోకి వచ్చే విదేశీయులపై నిఘా పెంచాలని డీజీపీ అంజనీకుమార్‌ జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు.

Published : 05 Feb 2023 03:56 IST

నేర సమీక్ష సమావేశంలో డీజీపీ అంజనీకుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: విజిటింగ్‌ వీసాలతో తెలంగాణలోకి వచ్చే విదేశీయులపై నిఘా పెంచాలని డీజీపీ అంజనీకుమార్‌ జిల్లాల పోలీసు అధికారులను ఆదేశించారు. అనుమతి లేని సమావేశాల్లో వారు పాల్గొనకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నేర పరిశోధన, పీడీ చట్టం, రైతు ఆత్మహత్యలు, కోర్టు కేసులు.. తదితర అంశాలపై శనివారం ఆయన సీఐడీ అదనపు డీజీపీ మహేశ్‌భగవత్‌, మహిళా భద్రత విభాగం అదనపు డీజీపీ షికాగోయల్‌తో కలిసి సమీక్షించారు. జోనల్‌ ఐజీలు, పోలీస్‌ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, జిల్లాల్లో నేరపరిశోధన, నేరస్థులకు శిక్షల్లో మంచి పురోగతి ఉందని ప్రశంసించారు. ప్రజాజీవనానికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ నిబంధనల మేరకు పీడీ చట్టం నమోదు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని కమిషనరేట్లు, ఎస్పీ యూనిట్ల పరిధిలో పీడీ చట్టం నమోదు ఏకరీతిన ఉండాలని  స్పష్టం చేశారు. నేరపరిశోధన, పీడీచట్టంపై ప్రభుత్వ న్యాయవాది ముజీబ్‌ వివరించారు. సమావేశంలో జోనల్‌ ఐజీలు చంద్రశేఖర్‌రెడ్డి, షానవాజ్‌ ఖాసిం పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని