Telangana News: గూగులమ్మకు యూట్యూబ్‌ కళాకారుల బోనాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ బద్దిపోచమ్మ అమ్మవారికి ఆదివారం కళాకారులు, భక్తులు బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు.

Updated : 06 Feb 2023 08:51 IST

వేములవాడ, న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ బద్దిపోచమ్మ అమ్మవారికి ఆదివారం కళాకారులు, భక్తులు బోనాలు సమర్పించి.. మొక్కులు చెల్లించుకున్నారు. ఇండస్ట్రీ ఆఫ్‌ తెలంగాణ ఫోక్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన యూట్యూబ్‌ కళాకారులు ‘గూగుల్‌ అమ్మతల్లికి యూట్యూబ్‌ బోనాలు’ పేరిట పెద్దఎత్తున కార్యక్రమం నిర్వహించారు. డప్పుచప్పుళ్లు, ఒగ్గుడోలు విన్యాసాలు, నృత్యాల మధ్య బోనాలతో ఊరేగింపు నిర్వహించడంతో పట్టణంలో సందడి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని