సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఏప్రిల్‌లో ప్రారంభం

సైబర్‌ భద్రతే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌ సీఎస్‌బీ)ను ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది.

Published : 21 Mar 2023 04:14 IST

కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలోని రెండు అంతస్తుల్లో ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: సైబర్‌ భద్రతే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్‌ సీఎస్‌బీ)ను ఏప్రిల్‌లో ప్రారంభించేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలోని రెండు అంతస్తుల్లో ఈ విభాగం కొలువుదీరనుంది. ఈ కేంద్రాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పోలీస్‌ కమిషనరేట్లతో అనుసంధానం చేస్తున్నారు. డీజీపీ అంజనీకుమార్‌, సైబరాబాద్‌ కమిషనర్‌, టీఎస్‌ సీఎస్‌బీ డైరెక్టర్‌ స్టీఫెన్‌ రవీంద్ర, హైదరాబాద్‌ సంయుక్త కమిషనర్లు పరిమళ హన నూతన్‌, గజరావ్‌భూపాల్‌, టీఎస్‌ సీఎస్‌బీ అడ్మిన్‌, ఆపరేషన్స్‌ ఎస్పీలు కేసీఎస్‌ రఘువీర్‌, విశ్వజిత్‌ కంపాటి, ఇంటెలిజెన్స్‌ ఎస్పీ ఎస్‌ఎం.విజయ్‌కుమార్‌ తదితరులు సోమవారం కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. విశ్వజిత్‌ కంపాటి, కేసీఎస్‌ రఘువీర్‌ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.

సీఎస్‌బీలో హెల్ప్‌లైన్‌, సైబర్‌ కంట్రోల్‌ రూమ్‌, కేంద్ర పర్యవేక్షణ విభాగం, డేటా ఎనాలసిస్‌, థ్రెట్‌ ఇంటెలిజెన్స్‌, ఫోరెన్సిక్‌ సపోర్ట్‌ యూనిట్లు ఉంటాయి. దీనికి ప్రభుత్వం 500 పోస్టులను కేటాయించింది.

దర్యాప్తు, న్యాయ విచారణకు ఇన్వెస్టిగేషన్‌ప్రాసిక్యూషన్‌ సపోర్ట్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్‌ ల్యాబ్‌, అకాడమీలు రానున్నాయి.

డిసెంబరులోగా బ్యూరోలో పూర్తిస్థాయి కార్యకలాపాలు కొనసాగిస్తుంది. అనంతరం సీఐడీ దగ్గరున్న సైబర్‌ నేరాల కేసులు దీనికి బదిలీ అవుతాయి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఉన్న సైబర్‌ నేరాల కేంద్రాలు కూడా బ్యూరోకు అనుసంధానమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని