శిథిల స్థితిలో బడి.. భయం గుప్పిట్లో విద్యార్థులు..!

సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేట ప్రాథమిక పాఠశాల భవనమిది. 40 సంవత్సరాల కిందట అయిదు గదులుగా భవనాన్ని నిర్మించగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది.

Published : 21 Mar 2023 04:52 IST

ఈనాడు, సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్‌ఖాన్‌పేట ప్రాథమిక పాఠశాల భవనమిది. 40 సంవత్సరాల కిందట అయిదు గదులుగా భవనాన్ని నిర్మించగా ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. గోడలకు పగుళ్లు ఏర్పడి.. కూలిపోయే స్థితికి చేరాయి. పైకప్పు పెచ్చులు ఊడి పడుతున్నాయి. వర్షం కురిస్తే పైనుంచి కారుతోంది. ఈ క్రమంలో 90 మంది విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ తరగతులకు హాజరవుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి కొత్త భవనం నిర్మించాలని, లేదంటే తక్షణమే మరమ్మతులు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని