సిరొంచలో శ్వేతనాగు

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచలో సోమవారం సాయంత్రం శ్వేతనాగు కనిపించింది.

Published : 22 Mar 2023 04:57 IST

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా సరిహద్దు ప్రాంతమైన మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా సిరొంచలో సోమవారం సాయంత్రం శ్వేతనాగు కనిపించింది. పాముల జాతిలో అరుదుగా తెల్లటి వర్ణంతో ఉండే ఈ నాగుపామును స్థానికులు ఆసక్తిగా చూశారు. ఓ ధాన్యం మిల్లు ఆవరణలో ఇది కనిపించగా మిల్లు సిబ్బంది పోలీసులకు తెలిపారు. స్టేషన్‌లోని ఒక కానిస్టేబుల్‌కు పాములు పట్టే నేర్పు ఉండడంతో ఆయన వచ్చి శ్వేతనాగును ఒడుపుగా బంధించారు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

న్యూస్‌టుడే, మహదేవపూర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని