హార్టికల్చర్‌ ఆఫీసర్‌ పరీక్ష జూన్‌ 17న

రాష్ట్రంలో ఏప్రిల్‌ 4న జరగాల్సిన హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఎంపిక రాత పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Published : 29 Mar 2023 04:38 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఏప్రిల్‌ 4న జరగాల్సిన హార్టికల్చర్‌ ఆఫీసర్‌ ఎంపిక రాత పరీక్షను వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పరీక్షను జూన్‌ 17న నిర్వహించనున్నట్లు వెల్లడించింది.

రద్దయిన, వాయిదాపడిన పరీక్షల తేదీలపై కసరత్తు

ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో రద్దు చేసిన, ఇతర కారణాలతో వాయిదా వేసిన పరీక్షల తేదీల ఖరారుపై టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. మంగళవారం కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యులు, అధికారులు సమావేశమై పరీక్షల నిర్వహణపై ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిసింది. రద్దయిన ఏఈఈ, ఏఈ, డీఏఓ పరీక్షలతో పాటు వాయిదా వేసిన టీపీబీఓ, వెటర్నరీ అసిస్టెంట్‌ పోస్టుల రాతపరీక్షల నిర్వహణపై చర్చించారు. ఇతర పరీక్షలు, సెట్‌లు, యూపీపీఎస్సీ పరీక్షల తేదీలను పరిగణనలోకి తీసుకుని 5 పరీక్షలకు కొత్త తేదీలను వెల్లడించనున్నారు. వారం రోజుల్లో ఈ తేదీలను ప్రకటించనున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని