మూగజీవికి ప్లాస్టిక్‌ ముప్పు

ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రకృతి సమతుల్యతనే కాదు.. మూగ జీవాల ప్రాణాలనూ తీస్తున్నాయి. ప్లాస్టిక్‌ సంచుల్లో పడేసే ఆహార పదార్థాలను తినే క్రమంలో.. ఆవులు, ఇతర పశువులు ఆ సంచులనూ మింగేస్తున్నాయి.

Published : 30 Mar 2023 05:20 IST

ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రకృతి సమతుల్యతనే కాదు.. మూగ జీవాల ప్రాణాలనూ తీస్తున్నాయి. ప్లాస్టిక్‌ సంచుల్లో పడేసే ఆహార పదార్థాలను తినే క్రమంలో.. ఆవులు, ఇతర పశువులు ఆ సంచులనూ మింగేస్తున్నాయి. ఇలా ప్లాస్టిక్‌ సంచులను తిని జీర్ణించుకోలేక కరీంనగర్‌లో బుధవారం ఓ ఆవు అనారోగ్యానికి గురైంది. జంతు ప్రేమికుల సమాచారంతో పశు సంవర్ధక శాఖ సిబ్బంది పశు వైద్యశాలకు తరలించారు. వైద్యులు ఆవుకు శస్త్రచికిత్స చేసి దాని పొట్టలో ఉన్న దాదాపు 50 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను బయటికి తీశారు. ఆవును బతికించడానికి కృషి చేస్తున్నామని వైద్యులు ప్రకాశ్‌, కిరణ్‌, శ్రీకాంత్‌ తెలిపారు.

న్యూస్‌టుడే, కరీంనగర్‌ మంకమ్మతోట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని