Summer: మండే వరకు ఎండలే.. ఏడు జిల్లాలకు హెచ్చరికలు
రాష్ట్రంలో 4 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 4 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. శుక్రవారంతోపాటు వచ్చే నెల మూడో తేదీ వరకు వివిధ జిల్లాల్లో ఎండలు మండనున్నట్లు తెలిపింది. కొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా నమోదవుతున్నాయి. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో రాష్ట్రంలోనే గరిష్ఠంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇదేసమయంలో రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి, కుమురంభీం-ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లోనూ 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో వాతావరణ శాఖ అప్రమత్తత ప్రకటించింది.
ఆరెంజ్, యెల్లో రంగు హెచ్చరికలు
శుక్రవారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఏడు జిల్లాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ రంగు సూచికను జారీ చేసింది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాలకు యెల్లో రంగు సూచికను జారీ చేసింది. ఈ జిల్లాల్లో వాతావరణాన్ని పరిశీలిస్తూ ఉండాలని పేర్కొంది.
ఏ రంగుకు... ఏ హెచ్చరిక?
ఉష్ణోగ్రతలు 35.9 డిగ్రీలను దాటితే వాతావరణ శాఖ మూడు రకాల సూచనలను జారీ చేస్తుంది. ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండేందుకు ఈ సూచనలను ప్రసార మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తుంది. నగరాలు, పట్టణాల్లో ఉండే డిజిటల్ బోర్డులపైనా ప్రదర్శిస్తుంది. 36-40 డిగ్రీల మధ్య ఉంటే యెల్లో (పరిశీలన), 41-45 డిగ్రీల మధ్య ఉంటే ఆరెంజ్ (అప్రమత్తం), 45 డిగ్రీలపైన ఉంటే రెడ్ (హెచ్చరిక) సంకేతాలను జారీ చేస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆరెంజ్ రంగు హెచ్చరికల స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే... ఆరుబయట పని చేసే వారు, ప్రయాణాలు చేసే వారు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత అధికంగా ఉండనున్న దృష్ట్యా ఆ సమయంలో నీడలో ఉంటే మేలంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
APGEA: ఉద్యోగులపై పోలీసుల వేధింపులు ఆపాలి: ఆస్కార్‌రావు
-
India News
Odisha Train Accident: ఒడిశా విషాదం.. టికెట్ లేని వారికీ పరిహారం!
-
Sports News
WTC Final: మరో రెండ్రోజుల్లో డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆస్ట్రేలియాకు భారీ షాక్
-
Movies News
Adivi Sesh: ‘కర్మ’పై అడివి శేష్ ఆసక్తికర ట్వీట్.. ఆయనతో పనిచేయడం గర్వంగా ఉందంటూ..
-
General News
Odisha Train Accident: రేపు, ఎల్లుండి పలు రైళ్లు రద్దు
-
India News
Odisha train tragedy: నెత్తుటి పట్టాలపై.. నలిగిపోయిన ‘ప్రేమ గీతాలు’!