నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో కొత్త టోల్‌ఛార్జీలు

జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీలను కేంద్రం అయిదు శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయడానికి ఆర్టీసీ సిద్ధమైంది.

Updated : 01 Apr 2023 04:11 IST

టికెట్‌పై రూ. 4 పెంపు!

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ రహదారులపై టోల్‌ ఛార్జీలను కేంద్రం అయిదు శాతం పెంచడంతో ఆ భారాన్ని ప్రయాణికులపై వేయడానికి ఆర్టీసీ సిద్ధమైంది. కొత్త ఛార్జీలు శనివారం నుంచి అమల్లోకి వస్తాయి. ఆర్డినరీ నుంచి గరుడ ప్లస్‌ వరకు బస్సుల్లో ఒక్కో ప్రయాణికుడిపై టోల్‌ప్లాజా ఛార్జీలను తాజాగా రూ.4 పెంచినట్లు తెలిసింది. ఇటీవల ప్రవేశపెట్టిన నాన్‌ ఏసీ స్లీపర్‌ బస్సులో రూ.15, ఏసీ స్లీపర్‌లో రూ.20 టోల్‌ఛార్జీ వసూలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. కొన్ని సిటీ ఆర్డినరీ బస్సులు టోల్‌ప్లాజా మీదుగా హైదరాబాద్‌ నుంచి సమీప ప్రాంతాలకు వెళ్లివస్తున్నాయి. వీటికి కూడా మరో రూ.4 పెంచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని