జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇక కాచిగూడ నుంచి..

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం.19714/19713) బయల్దేరే టెర్మినల్‌ను మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

Updated : 21 Apr 2023 05:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం.19714/19713) బయల్దేరే టెర్మినల్‌ను మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇంతవరకు ఈ రైలు సికింద్రాబాద్‌లో బయల్దేరి వెళుతుండగా.. ఇకపై కాచిగూడ టెర్మినల్‌ నుంచి ప్రారంభం కానుంది. ఈ నిర్ణయం.. జైపుర్‌ నుంచి బయల్దేరే రైలుకు ఈనెల 29వ తేదీ నుంచి, కాచిగూడలో బయల్దేరే రైలుకు మే 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. కాచిగూడ - జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ కాచిగూడలో సోమవారం రాత్రి 9.15 గంటలకు బయల్దేరుతుంది. బుధవారం ఉదయం 6.45 గంటలకు జైపుర్‌ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో జైపుర్‌లో శనివారం రాత్రి 10.35 గంటలకు బయల్దేరే రైలు సోమవారం ఉదయం 7.15 గంటలకు కాచిగూడకు చేరుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని