Prakash Raj: బుల్‌డోజర్‌ కేవలం భయపెడుతుంది: ప్రకాశ్‌రాజ్‌

మనిషిని మనిషిగా చూడాల్సి ఉందని.. ప్రస్తుత పాలనలో అది కనిపించడం లేదని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని ఉద్దేశించి సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు.

Updated : 21 May 2023 08:38 IST

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: మనిషిని మనిషిగా చూడాల్సి ఉందని.. ప్రస్తుత పాలనలో అది కనిపించడం లేదని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీని ఉద్దేశించి సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్‌ రాసిన ‘బుల్‌డోజర్‌ సందర్భాలు’ పుస్తకావిష్కరణ సభ శనివారం రాత్రి హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో జరిగింది. ఈ సందర్భంగా ప్రకాశ్‌రాజ్‌ మాట్లాడుతూ బుల్‌డోజర్‌కు హృదయం ఉండదని.. ఎదుటివారు భయపడినంతకాలం భయపెడుతూనే ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ..  20వ శతాబ్దంలో నియంతృత్వం, సైనిక పాలన ఉండేవని, ఇప్పుడవి కొత్త రూపాలను సంతరించుకుంటున్నాయన్నారు. బలమైన నాయకుడు, బలమైన రాజ్యం దేశానికి ప్రమాదకరమని అన్నారు. బీబీసీ తెలుగు సంపాదకుడు జీఎస్‌ రామ్మోహన్‌, సామాజిక కార్యకర్త సజయ, మలుపు సంస్థ నిర్వాహకుడు బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని