Salary Package: ‘ప్రాంగణ’ ప్యాకేజీ.. ఏటేటా పైపైకి..

బీటెక్‌ విద్యార్థులకు ప్రాంగణ నియామక వేతన ప్యాకేజీ ఏటేటా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం సగటున సుమారు 9 శాతం వృద్ధి నమోదవుతోంది. కేంద్ర విద్యాశాఖ తాజా నివేదిక ప్రకారం 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల సరాసరి వార్షిక వేతనం రూ.4,57,575. ‘దేశవ్యాప్తంగా బీటెక్‌లో దాదాపు 12 లక్షల సీట్లు ఉండగా, అందులో ఏటా సుమారు 8 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు.

Published : 19 Jun 2023 07:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: బీటెక్‌ విద్యార్థులకు ప్రాంగణ నియామక వేతన ప్యాకేజీ ఏటేటా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం సగటున సుమారు 9 శాతం వృద్ధి నమోదవుతోంది. కేంద్ర విద్యాశాఖ తాజా నివేదిక ప్రకారం 2021-22 విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్‌ విద్యార్థుల సరాసరి వార్షిక వేతనం రూ.4,57,575. ‘దేశవ్యాప్తంగా బీటెక్‌లో దాదాపు 12 లక్షల సీట్లు ఉండగా, అందులో ఏటా సుమారు 8 లక్షల మంది ప్రవేశాలు పొందుతున్నారు. చివరకు దాదాపు 5 లక్షల మంది ఉత్తీర్ణత సాధిస్తున్నారు. వారిలో 3.50 లక్షల మంది వరకు ప్రాంగణ నియామకాల్లో ఎంపికవుతున్నారు’ అని ఆ నివేదిక వెల్లడించింది. గత కొన్నేళ్లుగా సగటు వార్షిక వేతనం రూ.3-4 లక్షల మధ్యే ఉండగా, తొలిసారి 2021-22లో రూ.4 లక్షలు దాటడం, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 15 శాతం వృద్ధి నమోదవడం, 2017-18తో పోలిస్తే సగటు వేతనం 43 శాతం పెరగడం గమనార్హం. ‘కరోనా కారణంగా డిజిటల్‌ సాంకేతికతకు గిరాకీ పెరిగింది. వేలాది స్టార్టప్‌లు పుట్టుకురావడం వల్ల విద్యార్థులకు డిమాండ్‌ పెరిగింది. ఈ కారణంగానే 2021-22లో అధిక సంఖ్యలో నిపుణులైన విద్యార్థులను కంపెనీలు ఎంపిక చేసుకోవడంతోపాటు, వార్షిక వేతన ప్యాకేజీనీ పెంచాయి’ అని ఇంజినీరింగ్‌ ఆచార్యులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని